ఆచార్యకు మరో ఎదురుదెబ్బ  

Rain Effect On Acharya Movie - Telugu Acharya, Chiranjeevi, Chiru 152, Koratala Siva

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సక్సెస్‌ను అందుకున్నాడు.ఈ సినిమా తరువాత మెగాస్టార్ సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని రెడీ చేస్తున్నాడు.

 Rain Effect On Acharya Movie

ఇప్పటికే షూటింగ్ కూడా మొదలుపెట్టిన ఈ సినిమాకు ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.అయితే లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో సినిమాల షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు చిత్ర వర్గాలు రెడీ అవుతున్నాయి.

ఆచార్య సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తికాగా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.అయితే కరోనా కారణంగా ఆచార్య చిత్రానికి రెండు నెలల దెబ్బ పడింది.

ఆచార్యకు మరో ఎదురుదెబ్బ-Gossips-Telugu Tollywood Photo Image

ఈ రెండు నెలల్లో ఎక్కువ శాతం షూటింగ్ పూర్తి చేసుకోవాలని చూసిన కొరటాలకు మరో ఎదురుదెబ్బ తగిలేందుకు రెడీ అయ్యింది.ఆచార్య కోసం వేసిన సెట్స్ అకాల వర్షం కారణంగా దెబ్బతిన్నాయి.

దీంతో ఇప్పుడు మళ్లీ సెట్స్ కొత్తగా నిర్మించాలంటే భారీగా ఖర్చవుతుంది.పోనీ సెట్స్ వేశాక షూటింగ్ నిర్వహిద్దామని అనుకుంటే, వచ్చేది వర్షాకాలం కావడంతో ఈ సినిమా షూటింగ్‌పై తీవ్ర ప్రభావం పడనుంది.

ఏదేమైనా ఆచార్యకు కరోనా దెబ్బతో పాటు వరుణుడి రూపంలో మరో ఎదురుదెబ్బ తగలడంతో చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో కనిపిస్తుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.మరి ఆచార్యకు వరుణుడి ఎదురుదెబ్బ తప్పదా అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rain Effect On Acharya Movie Related Telugu News,Photos/Pics,Images..

footer-test