నగరంలో బీభత్సం సృష్టిస్తున్న వర్షం..!  

hyderabad, Rain, creating, Drainages - Telugu Creating, Drainages, Hyderabad, Rain

నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మరోసారి డ్రైనేజీలు, నాలాలు ఉప్పొంగాయి.బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి.

TeluguStop.com - Rain Creating Havoc In The City

ఈ రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.కురుస్తున్న వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి.

శుక్రవారం సాయంత్రం నుంచి ఇప్పటివరకూ వర్షం కురుస్తూనే ఉండటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.తూర్పు ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడం వల్ల 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

TeluguStop.com - నగరంలో బీభత్సం సృష్టిస్తున్న వర్షం..-General-Telugu-Telugu Tollywood Photo Image

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

లోతట్టు ప్రాంతాల కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి.నాలాలు పొంగి పొర్లుతున్నాయి.

దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.డిజాస్టర్ టీంను కూడా రంగంలోకి దింపారు.

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.అయితే ఇటీవల చోటు చేసుకున్న ఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.

నాలాల వద్ద ప్రమాదం పొంచి ఉంటుందని ఎవరూ రావొద్దని హైఅలర్ట్ విధించింది.హయత్ నగర్ లో అత్యధికంగా 13.1 సెంటిమీటర్ల వర్షాపాతం నమోదైంది.ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది.మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సమస్య తలెత్తినా స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.

#Hyderabad #Creating #Rain #Drainages

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rain Creating Havoc In The City Related Telugu News,Photos/Pics,Images..