రైల్వే స్టేషన్ లో ఇక నూతన సిస్టమ్.. కీలకం నిర్ణయం తీసుకున్న రైల్వే..!

భారతీయ రైల్వేస్ సరికొత్త టెక్నాలజీని రూపొందించింది.రైల్వే స్టేషన్లకు ఎంతో ప్రయాణికులు వస్తుంటారు.

 Railways, News System , New Rules, Irctc, Central Government, Social Media, Pass-TeluguStop.com

అయితే ఎంతమంది వచ్చారనేది చెప్పడం చాలా కష్టం.అయితే రైల్వే స్టేషన్లలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనేది కనుక్కోవడ కోసం రైల్వే శాఖ ఫేషియల్ రికగ్నెషన్ సిస్టమ్ అనే టెక్నాలజీని ఉపయోగిస్తోంది.

వీటిని రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయనుంది.ఈ టెక్నాలజీ ద్వారా రైల్వే స్టేషన్ కు ఎంతమంది ప్రయాణికులు వచ్చారనేది తెలుసుకోవచ్చు.

ఈ టెక్నాలజీని దేశంలోని ముఖ్యమైన 30 రైల్వే స్టేషన్లలో తీసుకుని వచ్చింది.గుజరాత్, ముంబై, సికింద్రాబాద్, అలహాబాద్ వంటి ప్రముఖ రైల్వే స్టేషన్లలో ఫేషియల్ రికగ్నెషన్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చింది.

ఈ రైల్వే స్టేషన్లలో రోజుకు లక్షల్లో ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు.రైల్వే స్టేషన్లకు వచ్చే వారిని లెక్కించడం చాలా కష్టమైన పని.ప్రయాణికులను లెక్కించేందుకు పలు రైల్వే స్టేషన్లలో ఐదు వందల ఫేషియల్ రికగ్నెషన్ కెమెరాలను అమర్చింది రైల్వే శాఖ.

Telugu Central, Irctc, System, Passengers, Railways-Latest News - Telugu

కాగా ఫేషియల్ రికగ్నెషన్ కెమెరాలను ఎన్ టెక్ ల్యాబ్స్ అనే రష్యాకు చెందిన స్టార్టప్ కంపెనీ రూపొందించింది.ఈ టెక్నాలజీ ద్వారా ప్రయాణికుల సంఖ్యను తెలుసుకోవచ్చు.అంతే కాదు 50 మంది ప్రయాణికులను ఒకే ఫ్రేమ్ లో ఉంచుతుంది.

మాస్క్ వేసుకొని ఉన్నా కూడా ఈ కెమెరా వారిని గుర్తుంది.వారి ఫేస్ ను రికగ్నైజ్ చేస్తుంది.

ఇక ప్రయాణికుల్లో ఎవరైనా నేరస్తులు ఉంటే.వారిని పట్టుకోవడంలో సహాయం చేస్తుంది.

ఎవరైనా తప్పిపోతే ఈ కెమెరాలు వారిని ట్రాక్ చేస్తాయి.త్వరలో ఇండియాలోని అన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఈ టెక్నాలజీని తీసుకొచ్చేందుకు భారత రైల్వే శాఖ సన్నాహం చేస్తుంది.

ఏం టెక్నాలజీ వచ్చినా దానిని వ్యతిరేకంచే వారు ఉంటారు.ఈ సిస్టమ్ ద్వారా ప్రజల గోప్యతకు, స్వేచ్ఛకు భంగం కులుగుతుందని విమర్శస్తున్నారు.

అయితే ఇది ప్రయాణికుల భద్రతకు ఉపయోగపడుతుందని, పోలీసులు కూడా క్రిమినల్స్ ను పట్టుకునేందుకు ఉపయోగిస్తున్నారని రైల్వే అఫీషియల్స్ అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube