రైల్వేల్లో యోగా తప్పనిసరి

రైల్వే ఉద్యోగులకు యోగా తప్పనిసరి చేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది.రైల్వే శాఖకు చెందిన అన్ని శిక్షణ కేంద్రాల్లో యోగాను తప్పనిసరి కార్యక్రమంగా చేయాలని ప్రతిపాదన పరిశీలనలో ఉంది.

 Railways Makes Yoga Mandatory At Training Centres-TeluguStop.com

రెండువేల ఇరవై సంవత్సరం నాటికి రైల్వే శాఖలోని ఉద్యోగులందరినీ యోగా శిక్షణలో చేర్చాలని ప్రణాళికలు తయారుచేస్తున్నారు.రైల్వే శాఖ తన ఉద్యోగులకు, అధికారులకు, సాంకేతిక నిపుణులకు ఇచ్చే శిక్షణలో యోగా కూడా చేర్చబోతోంది.

అంటే ఉద్యోగపరమైన శిక్షణతో పాటు యోగాలో కూడా తప్పనిసరిగా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది.ఈ నెల ఇరవై ఒకటో తేదీన జరిగే ప్రపంచ యోగా దినోత్సవంలో రైల్వే ఉద్యోగులంతా తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుంది.

ఓ పక్క యోగాపై వివాదాలు చెలరేగుతుండగానే రైల్వేల్లో యోగాను తప్పనసరి చేయాలని నిర్ణయిస్తున్నారు.ఇది ఏ వివాదాలకు దారి తీస్తుందో.

దేశంలోని అతి పెద్ద వ్యవస్థల్లో ఒకటైన రైల్వేల్లో అన్ని మతాల వారూ ఉన్నారు.యోగా తమకు వర్తించదని, తాము యోగా చేయబోమని ముస్లింలు తెగేసి చెబతుతున్నారు.

క్రిస్టియన్లది కూడా ఇదే మాట.ఈ నేపథ్యంలో యోగాను చట్టబద్ధం చేస్తే వారు అంగీకరిస్తారా? ఏ మతం వారైనా యోగా చేయాల్సిందేనని భాజపా నేతలు అంటున్నారు.యోగా చేయనివారు దేశం విడిచి వెళ్లాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.యోగాను రైల్వేల్లో చట్టబద్ధం చేశాక ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ చేస్తారేమో…! యోగా మోదీ సర్కారుకు ఎలాంటి ‘యోగం’ కలిగిస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube