ప్రయాణికులకు షాకిచ్చిన రైల్వే అధికారులు.. ?

అసలే కరోనా వల్ల చేతిలో డబ్బులు లేకుండా ప్రజలు అవస్దలు పడుతుంటే ప్రభుత్వాలు మాత్రం ధరలకు రెక్కలు కట్టి వదులుతున్నాయి.ప్రస్తుతం ఒక మధ్యతరగతి మనిషి బ్రతకాలంటే ఎన్నో కష్టాలను ఎదుర్కొనే పరిస్దితులు సమాజంలో నెలకొన్నాయి.

 Railway Platform Ticket Price Hike, Secunderabad, Railway Platform, Ticket Price-TeluguStop.com

ఈ కరోనా కష్టకాలంలో పెరగని వస్తువు రేటు అంటూ లేదు.ఈ నేపధ్యంలో సికింద్రాబాద్​రైల్వే స్టేషన్ కూడా ప్రయాణికులు షాకయ్యే నిర్ణయాన్ని తీసుకుంది.తాజాగా ప్లాట్​ఫాం టికెట్ ధరను పెంచుతూ ఉన్నట్లుగా వెల్లడించింది.

కాగా ఇప్పటి వరకూ ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.30 ఉండగా, రూ 20 పెంచి రూ.50కి రౌండ్ ఫిగర్ చేశారు.అయితే పెరిగిన ఈ ప్లాట్​ఫాం టికెట్ ధర రేపటి నుంచే అమల్లోకి వస్తుందని రైల్వేశాఖ వెల్లడించింది.ఈమేరకు రైల్వేశాఖ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌత్​సెంట్రల్ రైల్వే సోమవారం ప్రకటించింది.

ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్​రైల్వే సీపీఆర్​ఓ రాకేష్ మాట్లాడుతూ, కొవిడ్ నిబంధనల్లో భాగంగా రైల్వే స్టేషన్‌లో రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ​ ప్రకటించడం ఆశ్చర్యకరం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube