రైల్వే బాదుడు మామూలుగా లేదుగా...!

క‌రోనా వైర‌స్ కారణంగా ఇల్లు గుల్లయి, జేబులు ఖాళీ అయిన విప‌త్క‌ర స్థితి గతుల్లో.అది చాలదన్నట్టు, ఇప్పుడు ఇండియన్ రైల్వే మ‌రో రకంగా డబ్బులు దండుకోవడానికి సిద్ధం అయింది.

 Railways To Include ‘user Fee’ In Train Fares, Irctc, Indian Railways , User-TeluguStop.com

ప్ర‌యాణికుల జేబులకు చిల్లులు పెట్టేందుకు రెడీ అవుతోంది.అదేమనగా.

ఇక నుంచి టికెట్ ధ‌ర‌తో పాటుగా యూజ‌ర్‌ చార్జీల‌ను కూడా వ‌సూలు చేయనుందట.ఈ మేర‌కు తాజాగా.

ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.అయితే ఇది కేవలం నిత్యనూతన సదుపాయాలు, రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ లలో మాత్రమే రైల్‌ టికెట్‌ ధరతో కలిపి యూజర్‌ చార్జీలు వసూలు చేస్తామని భారతీయ రైల్వే ప్రకటించడం గమనార్హం.

ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా ఆదాయార్జనలో భాగంగా వీటిని వసూలు చేస్తామని రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్ పేర్కొన్నారు.అయితే, ఈ చార్జీలు భారీగా ఉండబోవని యాదవ్‌ చెప్పడం కొసమెరుపు.
దేశంలోని 7000 రైల్వే స్టేషన్లలోని 10 నుండి 15 శాతం స్టేషన్లలో వీటిని అమలు చేయనున్నామని ఆయ‌న ఈ సందర్భంగా తెలిపారు.ఒకసారి స్టేషన్‌ ఆధునీకరణ పూర్తయ్యాక యూజర్‌ చార్జీ సొమ్మును రాయితీలకు మళ్లిస్తామని, అప్పటివరకు ఈ సొమ్ము స్టేషన్‌ అభివృద్దికి దోహద పడుతుందని వివరించారు.

ఇకపోతే ప్రస్తుతం దేశంలోని దాదాపు 50 స్టేషన్లను డెవలప్ చేయాలని రైల్వే భావిస్తోంది.ఈ క్రమంలోనే, ఆయా స్టేషన్ల కింద ఉన్న ఖాళీ భూములను 60 ఏళ్ల పాటు వాణిజ్య సంస్థలకు లీజుకు ఇవ్వాలని రైల్వే బోర్డు యాచిస్తోంది.

ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్‌ హబ్స్‌ ను రైలో పోలిస్‌ గా పరిగణిస్తారు.కాకపోతే రైల్వేలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని స్వాగతించిన వేళ టికెట్ల ధరలు భారీగా పెరుగుతాయన్న అనుమానాల మధ్య ఈ ప్రకటన రావ‌డం కొసమెరుపు.

త్వరలో.భారతదేశ వృద్ధిలో రైల్వేల వాటా 2 శాతానికి పైగా పెరగవచ్చని నీతి అయోగ్‌ సిఈఓ అమితాబ్‌ పేర్కొనడం విశేషం.

స్టేషన్ల ఆధునీకరణలో వస్తున్న జాప్యాన్ని తాజాగా నీతీ ఆయోగ్‌ ప్రశ్నించగా.వెంటనే 50 స్టేషన్ల అభివృద్ధి ప్రణాళికల కోసం ఉన్నతాధికారులతో కూడుకొనిన్న గ్రూప్ ‌ను ఆఘమేఘాల మీద ఏర్పాటు చేయ‌డం అందరికీ ఒకింత అనుమానాన్ని రేకెత్తిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube