వారికి గుడ్ న్యూస్... రైల్వే ఛార్జీలను సొంతంగా నిర్ణయించుకోవచ్చట...!

ప్రపంచంలోనే అతి పెద్ద రవాణా వ్యవస్థ ఏది అంటే.అందరికీ టక్కున గుర్తొచ్చేది భారతీయ రైల్వే వ్యవస్థ.

 Railway Ticket Charges Private Websites,good News, Railways, Indian Rails, Priva-TeluguStop.com

అవును.భారతీయ రైల్వే ప్రపంచంలోనే అత్యధిక రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటని చెప్పుకోవచ్చు.

ప్రతి రోజూ ఇక్కడ కోటీ అరవై లక్షల మంది ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు అంటే.ఇది ఎంత పెద్ద వ్యవస్థో మనం ఊహించుకోవచ్చు.

అదే విధంగా పది.పదిహేను లక్షల మెట్రిక్ టన్నుల గూడ్స్ ను ఇది రవాణా చేస్తోంది.ప్రపంచంలో ఒక్క భారతీయ రైల్వేలోనే సుమారు 17 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు అంటే నమ్మశక్యం కాదు.

ఇకపోతే, ప్రస్తుతం మన ఇండియన్ రైల్వే లోకి ప్రైవేట్ కంపెనీలు చేరనున్నాయి.ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేలా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.అదేమంటే… ఇక్కడ ఏసీ బస్సులు, విమానాలు నడిచే ప్రాంతాల్లో ప్రైవేట్ రైల్ సర్వీసులు ఉంటాయని, ఆయా ప్రాంతాల్లో నడిచే ప్రైవేట్ రైల్ ఛార్జీలు ఎంత వసూలు చేయాలి? అనే అంశం సదరు ప్రైవేట్ సంస్థలే నిర్ణయిస్తాయని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు ఛైర్మన్ అయినటువంటి VK యాదవ్ మాట్లాడుతూ… టికెట్ ధరను నిర్ణయించే వెసులుబాటు సదరు ఆపరేటర్లకు ఉంటుందని, ఈ విషయంలో కేంద్రానికి ఎలాంటి అధికారం ఉండబోదని స్పష్టం చేశారు.ఇక ఈ ఛార్జీలను నిర్ణయించే ముందు ఆ మార్గాల్లో ఎయిర్ కండిషన్ బస్సులు, విమానాలు కూడా ప్రయాణిస్తుంటాయనే విషయాన్ని ఆపరేటర్లు గుర్తుంచుకోవాలని సూచించారు.
కాగా.ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు ఆల్స్టమ్ SA, GMR, బంబార్డియర్, అదాని గ్రూప్ ఆసక్తి చూపుతున్నట్టు భోగట్టా.ఇక రానున్న రోజుల్లో ప్రైవేట్ సంస్థల ద్వారా రైల్వేలోకి 7.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని ఈ సందర్బంగా యాదవ్ తెలిపారు.దేశంలోని దాదాపుగా 109 రూట్లల్లో 151 ప్రైవేట్ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోనికి రానున్నాయి.ఇక రైల్వే ఆధునీకకరణ లిస్ట్ లో ఢిల్లీ, ముంబై రైల్వే స్టేషన్లు ఉన్నట్లు అయన తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube