బాబోయ్ రైల్వే ఉద్యోగులకు కరోనా,ఏకంగా 8 వందలకు పైగా…  

872 railway employees kin ex staffers test coronavirus positive, railway employees,ex staffers test ,coronavirus, corona positive - Telugu 872 Railway Employees Kin Ex Staffers Test Coronavirus Positive, Corona Positive, Coronavirus, Ex Staffers Test, Railway Employees

ఏకంగా 8 వందలకు పైగా రైల్వే ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది.దేశవ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే.

 Railway Employees Corona Ex Staffers

ఈ నేపథ్యంలో రైల్వే ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది.రోజురోజుకు దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడంలేదు.

ఈ మహమ్మారి నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందోనని ప్రజలు కోరుకుంటున్నారు.రోజురోజుకు మరణాల రేటు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

బాబోయ్ రైల్వే ఉద్యోగులకు కరోనా,ఏకంగా 8 వందలకు పైగా…-General-Telugu-Telugu Tollywood Photo Image

వైద్యులు, పోలీసులు, పారిశుద్య కార్మికులను ఈ కరోనా మహమ్మారి వెంటాడుతుంది.అయితే ఇప్పుడు తాజాగా రైల్వే ఉద్యోగులను కూడా ఈ కరోనా టార్గెట్ చేసింది.

తాజాగా సెంట్రల్‌ రైల్వే, వెస్ట్రన్‌ రైల్వేకు చెందిన సుమారు 872 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది.ఈ మేరకు రైల్వే అధికారులు వెల్లడించారు.

కరోనా మహమ్మారి వల్ల ఇప్పటి వరకు 86 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.వారిలో ఎక్కువగా సెంట్రల్ రైల్వేలో 559 మందికి కరోనా సోకగా, వెస్ట్రన్ రైల్వేలో 313 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

మృతిచెందిన 86 మందిలో 22 మంది రైల్వే ఉద్యోగులు కాగా.మిగిలినవారిలో వారి కుటుంబ సభ్యులు, రిటైర్డ్ సిబ్బంది ఉన్నారని చెప్పారు.కాగా, బాధితులందరినీ వెస్ట్రన్ రైల్వేకు చెందిన జగ్జీవన్ రామ్ ఆసుపత్రిలో చేర్పించారు.కరోనా రోగుల చికిత్స కోసం ఏప్రిల్‌లో ప్రత్యేకంగా ఆసుపత్రిని కేటాయించిన సంగతి తెలిసిందే.

#Corona Positive #Coronavirus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Railway Employees Corona Ex Staffers Related Telugu News,Photos/Pics,Images..