ఇటు భార్యకి, అటు తల్లికి సర్ది చెప్పలేక రైల్వే ఉద్యోగి ఏం చేశాడంటే...

ప్రస్తుత కాలంలో కొందరు క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు తమ తల్లిదండ్రులు జీవితాల్లో తీవ్ర విషాదాన్ని  నింపుతున్నాయి.తాజాగా ఓ యువకుడు రైల్వే ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులను బాగా చూసుకుంటూ పెళ్ళికూడా చేసుకున్నాడు.

 Railway Employees Commits Suicide In Hyderabad-TeluguStop.com

అయితే పెళ్లయిన తర్వాత  భార్య తన కుటుంబ సభ్యులతో సరిగా మెలగ లేకపోవడంతో ఇటు భార్యకి అటు తన కన్న తల్లికి సర్ది చెప్పలేక ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.

అయితే వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నగరంలో రాహుల్ అనే యువకుడు ఇటీవల కాలంలోనే రైల్వే ఉద్యోగం చేస్తూ తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు.

అయితే తన కొడుక్కి ఉద్యోగం రావడంతో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఎంతో ఆరాటంగా ఓ యువతిని చూసి పెళ్లి చేశారు.అయితే పెళ్ళైన మొదట్లో వీరి కాపురం ఎంతో అండగా ఉండేది.

అయితే ఏమైందో ఏమో ఈ మధ్యకాలంలో వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.అయితే ఈ గొడవల్లో రాహుల్ భార్య తన అత్తమామలతో సరిగా మెలిగేది కాదు.

దీంతో రాహుల్ రోజు ఒక పక్క తన తల్లిదండ్రులు మరో పక్క తన భార్య గొడవలతో సతమతమయ్యే వాడు.తాజాగా మరోసారి తన భార్య మరియు తల్లిదండ్రులు గొడవ పడడం తో ఇద్దరికీ సర్ది చెప్పలేక తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడు.

Telugu Employeecommits, Hyderabad-Telugu Crime News(క్రైమ్ వార

రాహుల్ కుటుంబ సభ్యుల నుంచి  సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు.అలాగే కుటుంబ సభ్యులు తెలిపిన టువంటి వివరాల మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube