మరోసారి కరోనా ఐసోలేషన్‌ వార్డులుగా రైల్వే బోగీలు..!

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్  ప్రపంచవ్యాప్తంగా పంజా విసురుతుండడంతో ఇప్పటికే పలు ప్రాంతాలలో హాస్పిటల్లో బెడ్స్  కొరత ఎక్కువగానే ఉంది ఓవైపు ఆక్సిజన్ కొరతతో, మరోవైపు బెడ్స్  కొరతతో, కరోనా వైరస్ రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.ఈ క్రమంలో రైలు బోగీలను మరోసారి ఐసోలేషన్‌ వార్డులుగా మార్చేందుకు సిద్ధమవుతోంది రైల్వేశాఖ.

 Railway Bogies As Corona Isolation Wards Once Again-TeluguStop.com

కరోనా వైరస్ మొదటి విడతలో ఆసుపత్రిలో బెడ్స్ కొరత ఉండటంతో రైలు బోగీలను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చిన సంగతి అందరికి విదితమే ప్రస్తుతం కరోనా సెకండ్  వేవ్ విజృంభణతో కూడా బెడ్స్ కొరత ఉండటంతో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.దేశంలో ఇప్పటికే 3816 రైల్వే కోచ్ లను కొవిడ్ -19 కేర్ కోచ్‌ లుగా మార్చినట్లు రైల్వేశాఖ తెలియజేస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్స్ కొరకు కోచ్‌ లను ఇలా ఐసోలేషన్ వార్డ్స్ గా మారుస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలియజేసింది.,/br>

 Railway Bogies As Corona Isolation Wards Once Again-మరోసారి కరోనా ఐసోలేషన్‌ వార్డులుగా రైల్వే బోగీలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే మహారాష్ట్ర రాష్ట్రం లోని నందుర్బార్ జిల్లాలో 21 రైల్వే కోచ్లను కొవిడ్ -19 కేర్ కోచ్ మార్చినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసిన సంగతి అందరికి తెలిసిందే.ఈ క్రమంలో షుకుర్‌ బస్తీ వద్ద 25, ఆనంద్ విహార్‌లో 25, వారణాసిలో 10, భడోహిలో పది, ఫైజాబాద్ వద్ద 10 కొవిడ్-19 కేర్ కోచ్‌ లను కరోనా రోగుల కోసం అందుబాటులో ఉంచినట్లు తెలుస్తుంది.అలాగే ఆరోగ్య సంరక్షణ ప్రయత్నాల్లో భాగంగా మొత్తం 5,601 రైల్వే కోచ్‌లను కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మారుస్తున్నట్లు రైల్వేశాఖ  ప్రకటించింది.

  తేలిక పాటి కరోనా రోగులకు వైద్య సేవలను అందించడానికి ఈ ఐసోలేషన్‌ వార్డులను  ఉపయోగించుకోవచ్చని రైల్వేశాఖ  చెప్పింది.

#Changed #Carona Patients #Railway #Raliway Minster #Carona Wave

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు