ఏపీలో కూడా రేవంత్ లాంటి వారు కావాలంటున్న రాహుల్.. కుదురుతుందా..

రెండు తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ ప‌రిస్థితి ఎలా త‌యార‌యిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.అయితే తెలంగాణ‌లో అంతా ఇంతో బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ కేసీఆర్ త‌న వ్యూహాల‌తో కాంగ్రెస్‌ను మొత్తం బ‌ల‌హీన ప‌రిచేశారు.

 Rahul Wants People Like Rewanth In Ap Too Will It Happen  , Rahul, Revanth , Con-TeluguStop.com

కానీ ఏపీలో మాత్రం కాంగ్రెస్‌కు క‌నీసం ఉనికి లేకుండా పోయింది.అస‌లు ఆ పార్టీ ఏపీలో ఉందా అనే అనుమానాలు క‌లుగుతున్న స‌మ‌యంలో ఇప్పుడు తెలంగాణ‌లో కొత్త జోష్ క‌నిపిస్తోంది కాంగ్రెస్ పార్టీలో.

అయితే ఎంద‌రు వ్య‌తిరేకించినా కూడా రాహుల్ మాత్రం వెన‌క‌డుగు వేయ‌కుండా రేవంత్‌కు పార్టీ ప‌గ్గాలు ఇచ్చారు.

ఇక రేవంత్ రెడ్డిని కొత్త టీపీసీసీ అధ్య‌క్షుడిగా నియమించిన త‌ర్వాత రాహుల్ అనుకున్న‌ట్టుగానే కాంగ్రెస్‌కు కొత్త జ‌వ‌స‌త్వాలు వ‌స్తున్నాయి.

ఇప్ప‌టికే పార్టీలోకి చేరిక‌లు కూడా జ‌రుగుతున్నాయి.ఇలాంటి క్ర‌మంలోనే ఏపీలోని కాంగ్రెస్ పార్టీల‌పై రాహుల్ ఫోక‌స్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది.ఎలాగైతే ఉనికి కోల్పోతున్న కాంగ్రెస్‌కు రేవంత్ జోష్ తీసుకువ‌స్తున్నారో అలాగే ఏపీలో కూడా క‌నుమ‌రుగైన పార్టీని మ‌ళ్లీ తెర‌మీద‌కు రావాల‌ని రాహుల్ ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది.ఇందుకోసం రీసెంట్ గా కాంగ్రెస్ నాయకుల‌ను రాహుల్ క‌లిసి పార్టీ ప‌రిస్థితుల‌పై ఆరా తీశారంట‌.

Telugu Congress, Kvpramachandra, Rahul, Rahulrewanth, Revanth-Telugu Political N

కాబ‌ట్టి ఏపీలో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీకి మ‌ళ్లీ పూర్వ వైభ‌వం తీసుకురావాలంటే మంచి దూకుడు ఉన్న బ‌ల‌మైన రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు కావాల‌ని చూస్తున్నారంట‌.ఇక పార్టీ అస‌లు ఉందా అనే అనుమానం క‌లుగుతున్న క్ర‌మంలో ఏపీలో కాంగ్రెస్ ను న‌డిపించేందుకు ఒక్కరు సరిపోర‌ని, క‌నీసం ముగ్గురైనా బ‌ల‌మైన నేత‌లు కావాల‌ని ఆయ‌న భావిస్తున్నారంట‌.ఇక ఇందులో భాగంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని తెర‌మీద‌కు తెస్తున్నారు.అలాగే వైఎస్సార్ ఆత్మ అయితే కేవీపీ రామచంద్రరావుతో పాటు మ‌రికొంద‌రు సీనియ‌ర్ల‌ను మ‌ళ్లీ యాక్టివ్ రాజ‌కీయాల్లోకి ర‌ప్పిస్తున్నారంట‌.

చూడాలి మ‌రి ఏ మేర‌కు ప్లాన్ వ‌ర్కౌట్ అవుతుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube