బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ పై రాహుల్ అల్టిమేట్ కామెంట్స్!  

బిగ్ బాస్ సీజన్ 4 రియాల్టీ షో దాదాపు 11 వారాలు పూర్తి చేసుకుంది.మరి కొద్ది రోజులలో ముగియనున్న ఈ షోపై ప్రేక్షకులు ఎంత ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు.

TeluguStop.com - Rahul Sipligunj Shocking Comments On Akhil Sarthak Behaviour

బిగ్ బాస్ సీజన్ 4 విజేత గా ఎవరు ఉంటారని ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఏర్పడింది.ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినాఅఖిల్ పై ప్రముఖ సింగర్ బిగ్ బాస్ త్రీ విజేత రాహుల్ సిప్లింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ప్లే బ్యాక్ సింగర్ గా తన కెరీర్ మొదలుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రాహుల్ బిగ్ బాస్ త్రీ టైటిల్ గెలవడంతో మరింత పాపులర్ అయ్యారు.ప్రస్తుతం ప్లే బ్యాక్ సింగర్ గా కొనసాగిస్తూ, ప్రైవేట్ ఆల్బమ్స్ వదులుతూ యూత్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.

TeluguStop.com - బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ పై రాహుల్ అల్టిమేట్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

రాహుల్ బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లను ఇంటర్వ్యూ చేస్తున్నాడు.అదే సమయంలో ఆ షో పై తన అభిప్రాయాలను వారితో పంచుకుంటున్నాడు.

రాహుల్ పర్సనల్ గా నాలుగో సీజన్ పై అంచనాలు వేస్తూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల పై కూడా స్పందిస్తున్నారు.నాలుగో సీజన్ లో నోయల్ గెలిచే అవకాశాలు ఉంటాయని అంచనా వేసిన రాహుల్ నోయల్ ఎలిమినేషన్ ద్వారా సోహెల్, అరీయాన గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఉన్న అఖిల్ పై రాహుల్ షాకింగ్ కామెంట్ చేశారు.హౌస్ లో అఖిల్ సీక్రెట్ రూమ్ కి వెళ్లి వచ్చిన తర్వాత”నేను మేకల లోపలికి వెళితే అక్కడ వాళ్ళు పెట్టిన ప్రొటీన్లతో పులిలా బయటకు వచ్చాను”అంటూ ఓ సందర్భంలో మాట్లాడిన మాటలను రాహుల్ తప్పుబట్టారు.అఖిల్ ఆరోజు ఆడిన ఆట తీరు ఏమాత్రం బాగాలేదని అఖిల్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

#Tiger #Bigg Boss4 #Akhil Sarthak #Secret Room #Rahul Sipligunj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు