పాపం రాహుల్.. బేబీని నమ్మితే 58 లక్షలు పోయాయట..!  

దశాబ్ద కాలం నుంచి ఇండస్ట్రీలో పాటలు పాడుతూ రాహుల్ సిప్లిగంజ్ ఫేమస్ అయ్యారు.అయితే సింగర్ గా కంటే బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొనడం వల్లే రాహుల్ సిప్లిగంజ్ కు పాపులారిటీ వచ్చింది.

TeluguStop.com - Rahul Sipligunj Shocking Comments About Baby Music Album

బిగ్ బాస్ షోలో పునర్నవితో లవ్ ట్రాక్ వల్లే రాహుల్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాడని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతూ ఉంటారు.ఒకవైపు సింగర్ గా పాటలు పాడుతూనే రాహుల్ ప్రైవేట్ ఆల్బమ్ లు రిలీజ్ చేసేవారు.

రాహుల్ ఇప్పటివరకు చేసిన ప్రైవేట్ ఆల్బమ్ లలో మెజారిటీ ఆల్బమ్ లు హిట్ అయ్యాయి.కొన్ని రోజుల క్రితం అషురెడ్డితో డేటింగ్ చేస్తున్నానంటూ వార్తల్లో నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం బిగ్ బాస్ బజ్ కు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

TeluguStop.com - పాపం రాహుల్.. బేబీని నమ్మితే 58 లక్షలు పోయాయట..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

రాహుల్ సిప్లిగంజ్ కొన్ని రోజుల క్రితం బేబీ పేరుతో ఒక ప్రైవేట్ ఆల్బమ్ ను విడుదల చేశారు.అయితే గత ఆల్బమ్ లలా బేబీ ఆల్బమ్ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.

తాజాగా రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ బేబీ ప్రైవేట్ ఆల్బమ్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదని 58 లక్షల రూపాయలు బేబీ ప్రైవేట్ ఆల్బమ్ పై ఖర్చు చేసినట్టు తెలిపారు.మొదట బేబీ సాంగ్ కు 20 లక్షలు ఖర్చవుతుందని అనుకున్నామని అయితే వివిధ కారణాల వల్ల 58 లక్షల రూపాయలు ఖర్చు కావడంతో నిర్మాతలు 30 లక్షల రూపాయలు, తాను 28 లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని అన్నారు.

బేబీ సాంగ్ కు పని చేసిన వాళ్లు పేమెంట్ ఇవ్వమని అడుగుతుంటే ఒత్తిడి తట్టుకోలేక హార్ట్ బ్రేకింగ్ సింబల్ పెట్టానని.అదే సమయంలో పునర్నవి ఎంగేజ్ మెంట్ గురించి పెట్టడంతో జనాలకు మరో విధంగా అర్థమైందంటూ రాహుల్ తన ఆవేదనను తెలిపారు.

రాహుల్ సింగర్ గా సంపాదించిన డబ్బంతా బేబీపై ఖర్చు చేయగా లక్షల్లో నష్టపోవడం గమనార్హం.

#58 Lakh Rupees #Rahul Sipligunj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rahul Sipligunj Shocking Comments About Baby Music Album Related Telugu News,Photos/Pics,Images..