బిగ్ బాస్ విన్నర్ రాహుల్ పై దాడి! పబ్ లో గొడవ

బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఎక్కువగా నైట్ పార్టీ కల్చర్ లో ఫ్రెండ్స్ తో కలిసి సందడి చేస్తూ ఉంటాడనే సంగతి అందరికి తెలిసిందే.గతంలో అతని మీద తాగి బండి డ్రైవ్ చేసాడని ఆరోపణలు ఉన్నాయి.

 Rahul Sipligunj In Pub-TeluguStop.com

అయితే క్రింది స్థాయి నుంచి వచ్చి సింగర్ గా ఎదిగిన రాహుల్ ని ఫాలో అయ్యేవారు చాలా మంది ఉంటారు.అయితే అతను అమ్మాయిల పట్ల కాస్తా అతిగా ప్రవర్హిస్తూ ఉండటాడని విమర్శ ఉంది.

ఇప్పుడు ఇది వాస్తవమే అన్నట్లు తాజాగా పబ్ లో జరిగిన గొడవతో తెలుస్తుంది.

బుధవారం రాత్రి ఓ పబ్ లో స్నేహితులతో పార్టీ చేసుకుంటున్న రాహుల్ వేరొక బ్యాచ్ కి చెందిన అమ్మాయితో కాస్తా అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమెతో వచ్చిన అబ్బాయిలతో గొడవ జరిగింది.

వారి మధ్య మాటల యుద్ధం పెరగడంతో బ్యాచ్ లో ఒకడు బీరు సీసాతో రాహుల్ తల మీద దాడి చేసాడు.వివరాలు తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రాహుల్ ని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే ఈ ఇష్యూ గురించిన పూర్తి వివరాలు బయటకి రాలేదు.ఈ దాడి చేసిన వారిలో ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు సమాచారం.ఇక పోలీసులు కూడా ఈ కేసు విషయం పూర్తి వివరాలు ఈ రోజు బయట పెట్టె అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube