ఏ తెలుగు బిగ్‌బాస్‌ విన్నర్‌కు దక్కని అవకాశం రాహుల్‌కు దక్కింది  

Rahul Sipligunj Get Movie Offer From Director Krishna Vamsi - Telugu Rahul Sipligunj, బిగ్‌బాస్‌ విన్నర్‌ రాహుల్‌, రాహుల్‌

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 విన్నర్‌ గా నిలిచిన రాహుల్‌ సిప్లిగంజ్‌ చాలా లక్కీ అంటూ అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.అసలు సీజన్‌ టాప్‌ 5లో కూడా రాహుల్‌ ఉంటాడని ఎవరు అనుకోలేదు.

Rahul Sipligunj Get Movie Offer From Director Krishna Vamsi

పునర్నవి మరియు శ్రీముఖిల కారణంగా రాహుల్‌ ఫైనల్‌ వరకు వెళ్లాడు.చివర్లో శ్రీముఖి యాంటీ ఫ్యాన్స్‌ చేసిన ఓటింగ్‌తో ట్రోఫీ నెగ్గాడు.

రాహుల్‌కు సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ పెరిగింది.ఈయన భారీ ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నాడు.

ఆ క్రేజ్‌ను సినిమాల కోసం వినియోగించుకునేందుకు మేకర్స్‌ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే కొన్ని సినిమాలకు పాటలు పాడిన రాహుల్‌ సిప్లిగంజ్‌ ఇప్పుడు ఏకంగా సినిమా ఆఫర్‌ను దక్కించుకున్నాడు.

అది కూడా క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ సినిమాలో నటించే అవకాశంను పొందాడు.ఈ విషయాన్ని స్వయంగా రాహుల్‌ ట్వీట్‌ చేశాడు.రంగమార్తాండలో అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందటూ పోస్ట్‌ చేశాడు.

బిగ్‌బాస్‌ మూడు సీజన్‌లు పూర్తి అయ్యాయి.మొదటి సీజన్‌లో శివ బాలాజీ విన్నర్‌ అవ్వగా రెండవ సీజన్‌లో కౌశల్‌ విన్నర్‌ అయ్యాడు.శివబాలాజీకి సినిమాల్లో పెద్దగా ఛాన్స్‌లు లేవు.

కౌశల్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్నారు.కాని అదేం జరగలేదు.

కాని సీజన్‌ 3 విన్నర్‌ రాహుల్‌కు మాత్రమే అరుదైన అవకాశం దక్కింది.బిగ్‌బాస్‌ వల్ల ఇప్పటి వరకు తెలుగు వారిలో అత్యధికంగా ప్రయోజనం పొందింది రాహుల్‌ అంటూ అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rahul Sipligunj Get Movie Offer From Director Krishna Vamsi-,బిగ్‌బాస్‌ విన్నర్‌ రాహుల్‌,రాహుల్‌ Related....