బిగ్ బాస్‌కి మ‌ళ్లీ రాహుల్ సిప్లిగంజ్.. క్లారిటీ కూడా వ‌చ్చేసింది!

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన్మెంట్ చెసిన రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్.మూడు సీజ‌న్లు పూర్తి చేసుకుంది.ఇప్ప‌టికే సీజ‌న్ 4 ప్రారంభం కావాల్సి ఉన్నా.క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది.ఇక త్వ‌ర‌లోనే కరోనా లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా షోను ప్రారంభించేందుకు నిర్వాహ‌కులు రంగం సిద్ధం చేశారు.

 Rahul Sipligunj Surprise Show In Bigg Boss! Rahul Sipligunj, Bigg Boss 4, Latest-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే షో నిర్వాహ‌కులు హౌస్ లోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేయ‌డంతో పాటు వాళ్ల‌ను సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంచిన‌ట్టు స‌మాచారం.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.ఈ షోలో మూడో సీజ‌న్ విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉండ‌బోతున్నాడ‌ట‌.ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా చెప్పారు.

అయితే మ‌ళ్లీ కంటెస్టెంట్‌గా రాబోతున్నాడు అని అనుకుంటే పొర‌పాటే.

ఎందుకంటే.అలా జ‌ర‌గ‌డం బిగ్ బాస్ చ‌రిత్ర‌లోనే లేదు.

అస‌లు విష‌యం ఏంటంటే.తాజాగా రాహుల్ ఇన్స్టాగ్రామ్‌ లైవ్‌లో ప్రేక్ష‌కుల‌తో తన అప్ కమింగ్ షోస్ గురించి ప‌లు విష‌యాలు పంచుకున్నారు.

ఈ క్ర‌మంలోనే బిగ్ బాస్ సీజన్ 4తో కూడా నేను ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు రాహుల్‌.

అయితే కంటెస్టెంట్‌గా కాద‌ని.

నాతో చిన్న షో ప్లాన్ చేస్తున్నారు అంటూ క్లారిటీ ఇచ్చారు.అదేంటో త్వరలో మీకే తెలుస్తోంద‌ని తెలిపారు.

దీంతో రాహుల్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా, మూడో సీజన్ ను విజయవంతంగా ర‌న్ చేసిన కింగ్ నాగార్జుననే నాలుగో సీజన్ ‌కి కూడా హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube