అషురెడ్డిని ఎత్తుకున్న రాహుల్.. తేడా కొడుతుందన్న నెటిజన్లు..!  

rahul sipligunj ashureddy photo goes viral in social media, big boss 2, big boss 3,rahul sipligunj, ashureddy, rangamarthanda, rahul sipligunj and ashu reddy friendship viral, punarnavi, ooko kaka dress store, ooko kaka dress store opening - Telugu Ashureddy, Big Boss 2, Big Boss 3, Dating Rumours, Lifting Ashu Reddy, Ooko Kaaka Shop, Ooko Kaka Dress Store, Ooko Kaka Dress Store Opening, Punarnavi, Rahul Sipligunj, Rahul Sipligunj And Ashu Reddy Friendship Viral, Rahul Sipligunj Ashureddy Photo Goes Viral In Social Media, Rangamarthanda

బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ గా అషురెడ్డి, బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ ప్రేక్షకులకు సుపరిచితమే.జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషురెడ్డి టిక్ టాక్ వీడియోల ద్వారా పాపులారిటీని సంపాదించుకోగా రాహుల్ సిప్లిగంజ్ పాటలు పాడటంతో పాటు ప్రైవేట్ ఆల్బమ్ లు చేస్తూ సినిమాల్లో నటుడిగా ఆఫర్లతో కూడా బిజీగా ఉన్నారు.

TeluguStop.com - Rahul Sipligunj Ashureddy Photo Goes Viral In Social Media

ప్రస్తుతం రంగమార్తాండ సినిమాలో రాహుల్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు.

అయితే అషురెడ్డి రాహుల్ సిప్లిగంజ్ మధ్య ఏదో ఉందని గత కొన్ని నెలలుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో రాహుల్ సిప్లిగంజ్ పునర్నవితో ప్రేమతో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.ఆ తరువాత వార్తలు నిజం కాదని తెలుస్తోంది.

TeluguStop.com - అషురెడ్డిని ఎత్తుకున్న రాహుల్.. తేడా కొడుతుందన్న నెటిజన్లు..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఆ తరువాత సోషల్ మీడియాలో అషురెడ్డితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ హార్ట్ సింబల్ పెట్టారు.అషు రెడ్డి క్లోజ్ ఫ్రెండ్ అని రాహుల్ సిప్లిగంజ్ తనతో ఉన్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చారు.

రాహుల్ , అషురెడ్డి కలిసి దిగిన ఫోటోలు సైతం తెగ వైరల్ అయ్యాయి.

సింగర్ గా ప్రూవ్ చేసుకుని నటుడిగా బిజీ అవుతున్న రాహుల్ సిప్లిగంజ్ కొన్ని రోజుల క్రితం .“ఊకో కాకా” అనే పేరుతో బట్టల్ వ్యాపారం ప్రారంభించారు.హైదరాబాద్ లో నిన్న “ఊకో కాకా” మరో స్టోర్ ప్రారంభమైంది.

అయితే ఈ స్టోర్ ప్రారంభానికి అషు రెడ్డి వస్తున్నట్లు చెబుతూ ఆమెను ఎత్తుకున్న ఫోటోను సోషల్ మీడియాలో రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్ చేశారు.రాహుల్, అషురెడ్డి అభిమానులు ఈ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

రాహుల్ సిప్లిగంజ్ అషురెడ్డిని ఎత్తుకున్న ఫోటోపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కొందరు నెటిజన్లు అషురెడ్డి, రాహుల్ మధ్య కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉందంటే తాము నమ్మమని ఏదో తేడా కొడుతోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

రాహుల్ అషురెడ్డి తనకు స్నేహితురాలే అని పోస్ట్ పెట్టినా భవిష్యత్తులో అషురెడ్డి స్నేహితురాలుగానే మిగిలిపోతారా.? అంటూ నెటిజన్లు కామెంట్లు అభిప్రాయపడుతున్నారు.

#RahulSipligunj #Ooko Kaaka Shop #Big Boss 3 #Dating Rumours #RahulSipligunj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు