చలం కథతో వెబ్ సిరీస్… హీరోగా స్టార్ కమెడియన్  

rahul ramakrishna lead role in chalam story, Tollywood, Venu Udugula, Chalam Kathalu, Web Series, Digital Entertainment - Telugu Chalam Kathalu, Digital Entertainment, Rahul Ramakrishna Lead Role In Chalam Story, Tollywood, Venu Udugula, Web Series

ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటాచలం కథల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.చాలా మంది రచయితలకి చలం రాసిన కథలు గొప్ప స్ఫూర్తిని ఇస్తాయి.

TeluguStop.com - Rahul Ramakrishna Lead Role In Chalam Story

పుస్తక ప్రియులకి కూడా బాగా ఇష్టమైన కథలు.అయితే చలం కథలలో శృంగారం ఎక్కువగా కనిపిస్తుంది, అలాగే స్వేచ్ఛ ముసుగులో స్త్రీని ఒక బానిసగా చూపిస్తారని కొంతమంది విమర్శకులు అంటూ ఉంటారు.

స్త్రీవాదులలో కూడా చాలా మందికి ఇదే అభిప్రాయం ఉంది.చలం మైదానం, అరుణ లాంటి కథలు చదివిన తర్వాత ఆయన రచనా శైలి తెలుస్తుంది.

TeluguStop.com - చలం కథతో వెబ్ సిరీస్… హీరోగా స్టార్ కమెడియన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే వయస్సు, ఆలోచించే సామర్ధ్యం బట్టి చలం కథలలో భావం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అర్ధమవుతుంది.పరిణితి లేని యుక్తవయస్సులో చదివితే శృంగారం తప్ప మరేమీ కనిపించదు.

పరిపక్వతతో ఆలోచించి చదివితే సమాజం కట్టుబాట్లు మధ్య స్త్రీ తరతరాలుగా ఎలా బందీ అయిపోయిందో కనిపిస్తుంది.అభ్యుదయం ముసుగులో పురుషాధిక్యత కనిపిస్తుంది.

హద్దులు లేని స్వేచ్ఛ ఎన్ని అనర్ధాలకి కారణం అవుతుందో అర్ధమవుతుంది.

అయితే చలం కథలలో శృంగారరసం ఎక్కువగా ఉండటం వలన వాటిని సినిమాలుగా మార్చే సాహసం ఎవరూ చేయలేకపోయారు.

అతను కథలు కంటే అప్పటి దర్శకుల ఆలోచనలు బాగా వెనుకబడిపోయి ఉండటం వలన కూడా ఆ కథలు తెరపైకి రాలేదు.అయితే ప్రస్తుతం డిజిటల్ ఎంటర్టైన్మెంట్ తో శృంగార రసభరితమైన వెబ్ సిరీస్ లు కూడా ఎక్కువగా వస్తున్నాయి.

వాటిని ప్రేక్షకులు కూడా ఆధరిస్తున్నాయి.ఈ నేపధ్యంలో దర్శక రచయిత వేణు ఊడుగుల నిర్మాతగా మారి చలం కథలని వెబ్ సిరీస్ గా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇందులో లీడ్ రోల్ కోసం కమెడియన్ రాహుల్ రామకృష్ణ ని కన్ఫర్మ్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.త్వరలో దీనికి సంబందించిన అఫీషియల్ ప్రకటన వస్తుందని తెలుస్తుంది.

అయితే ఈ వెబ్ సిరీస్ చలం రాసిన కథతో తెరకెక్కుతుందా, లేదంటే చలం జీవిత కథగా తెరకెక్కుతుందా అనేది అఫీషియల్ గా ప్రకటించే వరకు తెలియదు

.

#Web Series #Venu Udugula #Chalam Kathalu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rahul Ramakrishna Lead Role In Chalam Story Related Telugu News,Photos/Pics,Images..