గిరిజనుడి పాత్రలో తెలుగు కమెడియన్  

Rahul Ramakrishna Komuram Bheem Rrr Ntr - Telugu Komuram Bheem, Ntr, Rahul Ramakrishna, Rajamouli, Rrr

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Rahul Ramakrishna Komuram Bheem Rrr Ntr

ఇక ఈ సినిమాన దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా పట్ల యావత్ భారత దేశ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన అల్లూరి సీతారామరాజు లుక్‌లో చరణ్ అదరగొట్టాడు.

గిరిజనుడి పాత్రలో తెలుగు కమెడియన్-Gossips-Telugu Tollywood Photo Image

అటు కొమురం భీం పాత్రలో తారక్ ఎలా రెచ్చిపోతాడా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.అయితే కొమురం భీం స్నేహితుడి పాత్రలో ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో నటిస్తున్నాడు.

గిరిజనుడి పాత్రలో రాహుల్ నటన ఈ సినిమాకు చాలా హెల్పవుతుందని తెలుస్తోంది.కొమురం భీంతో సమానంగా ఉండే ఈ పాత్ర సినిమాలో ఎక్కువ సేపు కనిపిస్తుందట.

దీనికి సంబంధించిన షూటింగ్ కూడా రాహుల్ ఇప్పటికే ముగించాడట.ఈ సినిమాలో తన పాత్ర చాలా బాగా వచ్చిందని, దాని గురించి ఎక్కువ రివీల్ చేయలేనని ఆయన అన్నారు.

మొత్తానికి రాహుల్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే పాత్రతో రాబోతున్నాడని తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rahul Ramakrishna Plays Komuram Bheem Friend Related Telugu News,Photos/Pics,Images..