'ఆ విషయం ఎవ్వరికి చెప్పకండి'అంటూ అర్జున్ రెడ్డి ఫేమ్ 'రాహుల్' ఏమని పోస్ట్ చేసాడో తెలుసా.?   Rahul Ramakrishna Getting Engaged Soon     2018-10-24   12:01:34  IST  Sainath G

ఒకప్పుడు సినిమా ఛాన్సుల కోసం ఏళ్లకేళ్లు ఎదురు చూడ్డం,చెప్పులరిగేలా తిరగడం లేదంటే పెద్ద డైరెక్టర్ దగ్గర కొన్నేళ్లపాటు పనిచేయడం..కానీ ఇప్పుడు చాలామంది చేతులల్లో కెమెరాలు తమ మైండ్లో మెరిసిన ఆలోచనని షార్ట్ ఫిలింగా తీసేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం..అది హిట్టా ఫట్టా అనేది దానికొచ్చే వ్యూస్ చెప్పేస్తాయి… పెళ్లిచూపులు తీసి తన పేరు సిల్వర్ స్క్రీన్ పై చూసుకోకముందు తరుణ్ భాస్కర్ తీసిన సినిమా… సైన్మా అనే షార్ట్ ఫిలిం..అందులో హీరో ఎవరనుకున్నారు రాహుల్ రామకృష్ణ..అదేనండీ అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ శివా క్యారెక్టర్ చేసినతను. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ తో గీత గోవిందం లో కూడా నటించారు రాహుల్ రామకృష్ణ.

ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే…రాహుల్ రామకృష్ణ ఓ ఇంటివాడవుతున్నాడు. ఈ విషయాన్ని తనే ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అందరికంటే కాస్త భిన్నంగా సర్‌ప్రైజ్ చేశాడు. పెళ్లి చేసుకోబోతున్నాను. ఎవరికీ చెప్పకండి అంటూ.. జనవరి 15న పెళ్లి అని తన కాబోయే భార్యతో బీచ్‌లో దిగిన ఫోటోని షేర్ చేశాడు. రామక‌ృష్ణ పెళ్లి విషయం తెలియడంతో తోటి నటులు నిఖిల్ సిద్దార్థ్, సుశాంత్, కమెడియన్ వెన్నెల కిషోర్, విద్యుల్లేఖ రామన్‌లు శుభాకాంక్షలు తెలియజేశారు.

Rahul Ramakrishna Getting Engaged Soon-

ప్రస్తుతం ఓ తమిళ్ చిత్రంతో పాటు పలు తెలుగు చిత్రాల్లో నటిస్తున్నాడు.రచయితగా రాణిస్తూ సైన్మా అనే లఘు చిత్రంలో నటించి మెప్పించాడు. అర్జున్ రెడ్డి చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశాడు. పెళ్లి చూపులు చిత్రంలో రెండు పాటలు కూడా రాశాడు. ఇలా అన్ని రంగాల్లో రాణిస్తూ ఓ డిఫరెంట్ యాక్టర్‌గా ముద్ర వేసుకున్నాడు రామకృష్ణ.భార్యతో బీచ్‌లో దిగిన ఫోటో Click Hear