సినిమాల్లోనే కమెడియన్.. రియల్ లైఫ్ లో కేర్ అఫ్ కాంట్రవర్సీ!

టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రాహుల్ రామకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Comedian Rahul Ramakrishna Controversial Tweet On Mahatma Gandhi,comedian Rahul-TeluguStop.com

ఈ మధ్యకాలంలో విడుదలైన అన్ని సినిమాలలో కూడా రాహుల్ రామకృష్ణ కనిపిస్తున్నాడు.సినిమాలలో తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు రాహుల్ రామకృష్ణ.

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తనకు సంబంధం లేని విషయాల గురించి మాట్లాడుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు గాంధీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

అయితే తాజాగా గాంధీ జయంతి కావడంతో ఈ గాంధీజీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్ రామకృష్ణ.దీంతో మరొకసారి వార్తల్లో నిలిచాడు.గాంధీజీని ఉద్దేశిస్తూ రామకృష్ణ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశాడు.అందులో గాంధీ గొప్పవాడని నేను అనుకోను అంటూ రాసుకు వచ్చాడు.

గాంధీ జయంతి రోజున రాహుల్ రామకృష్ణ ఈ విధంగా ట్వీట్ చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది.ఈ ట్వీట్ పై స్పందించిన నెటిజెన్స్ రాహుల్ రామకృష్ణ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Telugu Controversy, Gandhi Jayanthi, Mahatma Gandhi, Tollywood, Tweets-Movie

కొందరు అయితే ఈరోజు మందు దొరకదు కాబట్టి మహాత్మా గాంధీని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే రాహుల్ రామకృష్ణ ఇలా వివాదాలలో నిలవడం ఇదేం కొత్త కాదు.గతంలో కూడా ఇలా పలు సందర్భాలలో నాకు సంబంధం లేని విషయాలను వాక్యాలు చేసి బూతు పదాలు మాట్లాడుతూ సోషల్ లో మీడియాలో ట్రోలింగ్స్ అయితే ఎదుర్కొన్నాడు.ఈ మధ్యకాలంలో విడుదలైన ఆర్ఆర్ఆర్, విరాటపర్వం, హ్యాపీ బర్త్డే, అంటే సుందరానికి, జాతి రత్నాలు లాంటి మంచి మంచి సినిమాలలో నటించి వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నాడు రాహుల్ రామకృష్ణ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube