ఆసక్తిని రేకెత్తిస్తున్న 'వై'.. బన్నీ వాసు చేతుల మీదుగా విడుదల

ఈమద్య కాలంలో బాగా ఫేమస్ అయిన రాహుల్ రామకృష్ణ మరియు శ్రీరామ్ కీలక పాత్రల్లో రూపొందిన ‘వై‘ సినిమా మోషన్‌ పోస్టర్‌ ను ప్రముఖ నిర్మాత బన్నీ వాసు విడుదల చేశాడు.ఈ సినిమా చాలా వైవిధ్యభరితంగా ఉండబోతుంది అంటూ మోషన్‌ పోస్టర్‌ చూస్తేనే అర్థం అవుతుంది.

 Rahul Ramakrishna And Sriram Y Movie Motion Poster-TeluguStop.com

ఇదో సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.మోషన్‌ పోస్టర్‌ తోనే సినిమా పై సినిమా లో ఉండే కథపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేయడం జరిగింది.

ఈ సినిమాకు బాలు అడుసుమిల్లి దర్శకత్వం వహించాడు.షూటింగ్‌ ముగించుకుని త్వరలో విడుదలకు సిద్దం అవుతున్న ఈ సినిమా పై ఆసక్తి భారీగా పెరిగింది.

 Rahul Ramakrishna And Sriram Y Movie Motion Poster-ఆసక్తిని రేకెత్తిస్తున్న వై’.. బన్నీ వాసు చేతుల మీదుగా విడుదల-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు తో పాటు తమిళంలో కూడా ఒకే సారి ఈ సినిమా ను రూపొందించడం జరిగింది.

తెలుగు మోషన్‌ పోస్టర్ ను నిర్మాత బన్నీ వాసు విడుదల చేయగా తమిళ మోషన్‌ పోస్టర్‌ ను తమిళ స్టార్‌ ఆర్య చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది.

తెలుగు మరియు తమిళంలో కూడా ఈ సినిమా ఆకట్టుకోవడం ఖాయం అన్నట్లుగా దర్శకుడు బాలు నమ్మకంగా ఉన్నారు.సినిమా ను విభిన్నమైన కథతో ఆకట్టుకునే కథనంతో రూపొందించినట్లుగా చెబుతున్నారు.

మోషన్‌ పోస్టర్‌ కు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ట్రైలర్‌ ను కూడా వెంటనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లుగా దర్శకుడు చెప్పుకొచ్చారు.యరకొండ ఎంటర్‌ టైన్‌ మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా విడుదల తేదీని అతి త్వరలోనే ప్రకటిస్తామని అంటున్నారు.

ఈమద్య కాలంలో వచ్చిన చాలా సినిమా లు మంచి కాన్సెప్ట్‌ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.మోషన్‌ పోస్టర్‌ చూస్తుంటే ఈ సినిమా కూడా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంను మీడియా వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

#Balu Director #MovieMotion #Rahul Ravindra #Sri Ram Hero

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు