'మెగా ' కలవరింతల్లో రాహుల్ ?

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని యాక్టివ్ చేయాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు.దీనికి తోడు ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్త అండదండలు ఉండడంతో మరింత స్పీడ్ పెంచారు.

 Rahul Gandi Enquiary On Chiranjivi Issue-TeluguStop.com

బీజేపీకి దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతుండడంతో, ఇదే సరైన అవకాశం గా భావిస్తూ, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజారిటీ స్థానాలు వచ్చేలా చేసి అధికారంలోకి తీసుకొచ్చేందుకు రాహుల్ ఆధ్వర్యంలో పెద్ద కసరత్తు జరుగుతోంది.కొద్దిరోజుల క్రితమే కాంగ్రెస్ ను మళ్లీ యాక్టివ్ చేసేందుకు ప్రశాంత్ కిషోర్ కీలక సూచనలు చేయడంతో, వాటిని ఫాలో అయిపోతున్నారు.

రాహుల్ .ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల పైన ఆయన దృష్టి సారించారు.తెలంగాణ, ఆంధ్రా లో ఎప్పటి నుంచో కాంగ్రెస్ శ్రేణులు నిరాశ నిస్పృహలో ఉండటం, పార్టీ ఇక పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అని అంతా అనుకుంటున్న సమయంలో, రాహుల్ ఏపీ తెలంగాణ పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

 Rahul Gandi Enquiary On Chiranjivi Issue-మెగా కలవరింతల్లో రాహుల్ -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ నియామకం విషయంలో ఎన్ని అభ్యంతరాలు వచ్చినా రేవంత్ కు పట్టం కట్టి అక్కడ పార్టీని యాక్టివ్ చేశారు.

ఇక ఏపీలో పార్టీకి బలమైన కేడర్ ఉన్నా, వారిని ముందుకు నడిపించే లీడర్లు లేకపోవడమే కాంగ్రెస్ కు ఈ పరిస్థితి రావడానికి కారణంగా రాహుల్ గుర్తించారు.అందుకే నాయకులందరినీ యాక్టివ్ చేసే పనిలో ఉన్నారు.

దీనిలో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి అంశాన్ని రాహుల్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.ఆయన కాంగ్రెస్ లో ఉన్నారా లేదా అనే విషయాన్ని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఉమెన్ చాందీని ఆరా తీసినట్లు తెలుస్తోంది.

Telugu Ap Congress, Apcc President, Chirnjivi, Megastar, Rahul Gandi, Revanth Reddy, Telangana Congress, Tpcc President, Umen Chandi-Telugu Political News

చిరంజీవి మన పార్టీలో ఉన్నారు కదా, ఆయన కాంగ్రెస్ ఓడిన తర్వాత ఎందుకు యాక్టివ్ గా ఉండటం లేదు.ఆయనను మీరు ఎందుకు కలుపు వెళ్లడం లేదు ? ఇలా అనేక అంశాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.అయితే చిరంజీవి సినిమాలపై దృష్టిపెట్టారని, రాజకీయాలు పట్టించుకోవడం లేదు అంటూ రాహుల్ తో చెప్పగా, చిరంజీవితో తాను మాట్లాడాలని, ఆయనకు ఒకసారి ఫోన్ చేసి నాతో మాట్లాడించండి చాలు అంటూ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.అయితే రాహుల్ చిరంజీవిని మళ్లీ యాక్టివ్ చేయాలనుకోవడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి.

ఆయనకు ఉన్న సినీ అభిమానులు, కాపు సామాజికవర్గం అండదండలు ఇవన్నీ రాహుల్ గుర్తించారని, అందుకే ఆయనను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమిస్తే తెలంగాణ తరహాలో మళ్లీ కాంగ్రెస్ ఏపీలో పుంజుకుంటుందని రాహుల్ అభిప్రాయపడుతున్నారట.అందుకే ఫోన్ లో మాట్లాడడం, వీలైతే స్వయంగా చిరంజీవి ప్రత్యేకంగా భేటీ అయ్యి, ఆయన కాంగ్రెస్ తరఫున యాక్టివ్ చేసేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

#Umen Chandi #Apcc President #Megastar #Chirnjivi #Revanth Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు