వయనాడ్ లో పర్యటిస్తున్న రాహుల్ కు ముద్దు పెట్టేశాడు!

పార్లమెంట్ లో ప్రధాని కన్ను కొట్టడం,హగ్ లు చేసుకోవడం వంటి చర్యలు చేసిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు,వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కి ఊహించని అనుభవం ఎదురైంది.కన్ను కొట్టడం,హగ్ లు చేసుకోవడం నీకు తెలిస్తే, ముద్దు పెట్టడం నాకు తెలుసు అన్నట్లు ఒక వ్యక్తి రాహుల్ కి చూపించాడు.

 Rahul Gandhiambushed Withkiss-TeluguStop.com

తన నియోజకవర్గ పర్యటన లో భాగంగా కాన్వాయ్ లో వెళుతున్న రాహుల్ ఆగి పార్టీ కార్యకర్తలను పలుకరించారు.అయితే సరిగ్గా ఆ సమయంలో ఒక వ్యక్తి అకస్మాత్తు గా దూసుకొచ్చి రాహుల్ కు ముద్దు పెట్టడం తో రాహుల్ ఒక్కసారిగా అవాక్కయ్యారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.రాహుల్ కాన్వాయ్ వద్దకు వచ్చిన కార్యకర్తల తో పలుకరిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం తో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవ్వగా,ఈ లోపు ఆయన భద్రతా సిబ్బంది ఆ వ్యక్తి ని వెనక్కి లాగేశారు.

అయితే ఇంత జరిగినా కూడా రాహుల్ ఏమాత్రం సహనం కోల్పోకుండా కార్యకర్తలను పలకరిస్తూ ముందుకు సాగడం విశేషం.

ఇటీవల వరదల నేపథ్యంలో వయనాడ్ పరిధిలోని పలు ప్రాంతాలు,గ్రామాలు దెబ్బ తిన్న నేపథ్యంలో తన నియోజకవర్గం ఆయిన వయనాడ్ లో రాహుల్ పర్యటించారు.

ఈ క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube