ఇనుప గోడలను కాదు బ్రిడ్జిలను నిర్మించండి

కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత కొన్ని నెలలుగా రైతులు నిరసన తెలియజేస్తుంటే.కేంద్రం నుండి ఎలాంటి స్పందన లేదు.

 Rahul Gandhi Tweet Against Bjp Governament, Farmers Protest, Rahul Gandhi, Twitt-TeluguStop.com

దేశం నలుమూలల నుండి విమర్శలు వస్తున్న గాని ఏమాత్రం లెక్క చెయ్యడంలేదు.ఈ నేపథ్యంలో మరోసారి రైతులు దేశవ్యాప్తంగా ఉద్యమించడానికి పిలుపు నిచ్చారు.

ఈ నెల 6 వ తేదీన తమ నిరసన తెలియేజేయనున్నారు.ఈ నేపథ్యంలో జనవరి 26 వ తేదీన రైతులు చేపట్టిన ఉద్యమం ఎలాంటి పరిస్థితికి దారి తీసిందో మనం అందరం చూశాం.

ఎర్రకోట వరకు రైతులు ట్రాక్టర్స్ ర్యాలీ నిర్వహించి అక్కడ రైతు జెండాను ఎర్రకోటపై ఎగరవేశారు.

ఈ క్రమంలో పోలీసు లు తమ లాఠీలకు పని చెప్పడంతో కొంతమంది రైతులకు గాయాలు అయ్యాయి, మరికొంత మంది ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు.

ఈసారి అలాంటి ఘటన చోటు చేసుకోకుండా అసలు రైతులను ఢీల్లీలోకి రానివ్వకుండా పోలీసులు ఇనుప చువ్వలతో కాంక్రీట్ పోసి గోడలను కడుతున్నారు.ఇనుప రాడ్లు కంచెలు శూలలతో సింఘూ సరిహద్దులో రోడ్డుకు అడ్డంగా పెద్ద పెద్ద భరికేడ్లను నిర్మించారు.

ఈ విషయంపై రాహుల్ గాందీ ట్విటర్ ద్వారా స్పందించాడు.ఇనుప గాడ్లను కాదు బ్రిడ్జిలను నిర్మించండి అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేశాడు.

అదే విదంగా కేంద్ర బి‌జే‌పి సర్కారుపై విమర్శలు చేశాడు.ఇనుప చువ్వలతో రైతులను ఢీల్లీలోకి రానివ్వకుండా వారితో ఇలా యుద్దం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Telugu Congress, Farmmars, Rahul Gandhi, Red Fort-Political .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube