మోడీ వలలో చిక్కుకుంటున్న రాహుల్ గాంధీ  

మోడీ మాటల గారడీకి దొరికిపోతున్న రాహుల్ గాంధీ. .

Rahul Gandhi Trapped To Modi Political Game-congress,modi Political Game,rahul Gandhi Trapped,tdp

దేశ రాజకీయాలలో ఇప్పుడు అత్యంత తెలివైన, సమర్ధవంతమైన రాజకీయ నాయకుడు అంటే కచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ గురించి చెప్పాలి. విపక్షాల విమర్శలని సైతం తనకి అనుకూలంగా మార్చుకొని ఎన్నికలలో లబ్ది పొందడం మోడీకి మాత్రమే సాధ్యం అవుతుంది. ఇక ప్రభుత్వ పరంగా దేశ రక్షణ కోసం చేసే పనులని కూడా తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి మోడీ వాడుకుంటున్నారని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి...

మోడీ వలలో చిక్కుకుంటున్న రాహుల్ గాంధీ-Rahul Gandhi Trapped To Modi Political Game

అయితే మోడీ మాత్రం సైలెంట్ గా తనదైన శైలిగా విపక్షాలపై విమర్శలు చేస్తూ దేశ రక్షణ కోసం తాను ఏం చేయడానికి అయిన సిద్ధం అనే విధంగా ప్రచారం చేసుకుంటున్నారు.తాజాగా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీని, అలాగే కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనలో ఎత్తి చూపిస్తూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ దేశంలో అరాచకం పెరిగిపోతుందని, రాహుల్ దేశ భద్రతని తీసుకెళ్ళి పాకిస్తాన్ కి అప్పగిస్తారు అంటూ విమర్శలు చేయడం ద్వారా ప్రజలని నమ్మించి లబ్ది పొందాలని చూస్తున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. తన గెలుపు కోసం మోడీ అన్ని అవకాశాలు ఉపయోగించుకొని, తన పబ్లిసిటీ స్ట్రాటజీతో ప్రజల నమ్మకం పొందే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాలలో చర్చించుకుంటున్నారు.