బాబు తీరుతో రాహుల్ గుర్రు ! కారణం ఇదే !  

Rahul Gandhi Angry On Chandra Babu-

టీడీపీ అధినేత చంద్రబాబు కి ఒక్కొక్కరుగా అంతా దూరం అయ్యేలా కనిపిస్తున్నారు. శత్రువుల సంఖ్యను రోజు రోజుకి పెంచేసుకుంటున్న బాబు తీరు ఇప్పుడు పార్టీలో కూడా చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే ఎన్డీయేకు దూరం అయ్యి మోదీ మీద విమర్శలు చేసి బాబు చాలానే నష్టపోయాడు, ఈ దశలో ఆయన విమర్శలు కూడా అదే రేంజ్ లో ఎదుర్కున్నాడు..

బాబు తీరుతో రాహుల్ గుర్రు ! కారణం ఇదే !-Rahul Gandhi Angry On Chandra Babu

చంద్రబాబు ఒక అవకాశవాది అని మోదీ పదే పదే విమర్శలు చేస్తున్నాడు. తమ పార్టీతో నాలుగున్నరేళ్ల పాటు కలిసి ఉండి తన కేబినెట్లో టీడీపీ మంత్రులను నాలుగున్నరేళ్ల పాటు కొనసాగించి ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వచ్చిన సమయంలో రాజకీయంగా లబ్ది పొందేందుకు బయటకి వెళ్లి మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బాబు మాటలు నమ్మొద్దు అంటూ మోదీ కాస్త గట్టిగా చెప్పేస్తున్నాడు. మోదీ విమర్శలు మామూలే అని లైట్ తీసుకుంటే చంద్రభాను తో సఖ్యతగా ఉంటూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి పొత్తు కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా బాబు పై ఇప్పుడు గుర్రుగా ఉంది.

ముఖ్యంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చంద్రబాబు పేరు చెప్తే మండిపడుతున్నాడట. దీనికి కారణం కూడా ఉందని టాక్ నడుస్తోంది. ఇటీవలే మహారాష్ట్ర రాజకీయ నేత శరద్ పవార్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి పదవికి తగిన వ్యక్తి అంటూ ప్రకటించాడు.

అలాగే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయవతి కూడా చంద్రబాబు పీఎం అవ్వాలంటూ చెప్పడం రాహుల్ కి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించిందట. అయితే చంద్రబాబు ప్రధానమంత్రి అంటూ వ్యాఖ్యానించిన ఆయా పార్టీల అధ్యక్షులు ఎవరూ సొంతంగా అలా వ్యాఖ్యలు చేయలేదని, వారితో బాబే అలా మాట్లాడించాడని రాహుల్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ప్రధాన మంత్రి అయ్యేందుకు తాను అష్టకష్టాలు పడుతుంటే తమకు సన్నిహితంగా ఉండే బాబు ఇలా చేయడం ఏంటి అని రాహుల్ తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానిస్తున్నాడట.

ఏపీ ఎన్నికలల్లో టీడీపీ సాధించే పార్లమెంట్ సీట్లను బట్టి బాబు విషయంలో ఏదో ఒక స్టెప్ తీసుకోవాలని రాహుల్ ఆలోచన చేస్తున్నాడని సమాచారం.