మళ్లీ బాధ్యతలు స్వీకరించబోతున్న రాహుల్‌

ఈ ఏడాది జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ దారుణ పరాజయంను మూట కట్టుకున్న నేపథ్యంలో అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే.ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు ఆయన్ను వారించినా కూడా రాజీనామాను వెనక్కు తీసుకోలేదు.

 Rahul Gandhi Take The Congress Responsibilites-TeluguStop.com

ఆయన స్థానం కోసం పలువురిని పరిశీలించారు.చివరకు సోనియా గాంధీకే మళ్లీ కాంగ్రెస్‌ అధినేత్రి పీఠంను కట్టబెట్టారు.

ఆమె వయసు మరియు ఇతరత్ర కారణాల వల్ల ఆమె బాధ్యతలను సరిగ్గా నెరవేర్చలేక పోతున్నారు.అందుకే ఆ స్థానంను మళ్లీ రాహుల్‌ గాంధీ స్వీకరించే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్నాయి.

సోనియా గాంధీ నుండి వచ్చే ఎన్నికల సమయానికి రాహుల్‌ గాంధీ పార్టీని స్వీకరించేందుకు సిద్దం అయ్యారు.ఆయన మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక అయ్యేందుకు ఒప్పుకున్నారు.

త్వరలోనే అందుకు సంబంధించిన లాంచనాలు పూర్తి చేస్తామంటూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చెబుతున్నారు.కాంగ్రెస్‌ అధినేతగా రాహుల్‌ హయాంలోనే రాబోయే ఎన్నికలను ఎదుర్కోబోతున్నట్లుగా ఈ సందర్బంగా రాహుల్‌ గాంధీ అభిమానులు చెబుతున్నారు.భవిష్యత్తు ప్రధాని రాహుల్‌ గాంధీ అంటూ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.2024లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం కన్ఫర్మ్‌, రాహుల్‌ పీఎం అవ్వడం ఖాయం అంటూ కాంగ్రెస్‌ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube