ఏపీలో కాక పుట్టిస్తున్న రాహుల్ సర్వే.     2018-02-08   21:28:32  IST  Bhanu C

దేశవ్యాప్తంగా ఎన్నో రకాల సర్వేలకి ఇది సీజన్ అని చెప్పాలి..పార్టీలకి చావో రేవో అనేట్టుగా ఉండే ఎన్నికల సమయంలో వచ్చే ఈ సర్వేలు నేతల్లో హీట్ ని మరింత పెంచుతాయి…ఈ ఎన్నికల కాలంలో సర్వేల ద్వారా ఎవరి డప్పు వాళ్లు కొట్టుకుంటూ ఉంటారు..అయితే చాలా మంది నేతలు ఏ పార్టీలోకి వెళ్ళాలో కూడా నిర్ణయించుకునేది ఈ సర్వేల ద్వారానే…అయితే కొన్ని రోజుల క్రితం రిపబ్లికన్ సర్వే చేపట్టిన సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఏపీ లో అధికారంలోకి వచ్చేది వైసీపినే అంటూ వచ్చిన వార్తలు అందరికీ తెలిసినదే..అయితే ఆ ఆతరువాత వచ్చిన లగడపాటి సర్వే లో కూడా జగన్ సీఎం అవుతాడు అంటూ పుకార్లు వచ్చాయి కూడా..అయితే

చంద్రబాబు కూడా ఏపీలో భవిష్యత్తు రాజకీయలాపై సర్వే చేయించుకున్నాడు అని తెలుస్తోంది అయితే ఆ సర్వేలు చంద్రబాబు కి అనుకూలంగా ఉన్నాయనేది మాత్రం వాస్తవం..అయితే ఇప్పుడు టిడిపికి రెండు సర్వేలు..అనుకూలంగా ఉంటే మరో పక్క వైసీపి కి కూడా రెండు సర్వేలు అనుకూలంగానే వచ్చాయి..అంటే రెండు పార్టీలకి రెండు సర్వేలు అనుకూలంగానే ఉన్నాయి దాంతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తాజాగా ఓ సర్వే చేయించుకున్నాడట..భవిష్యత్తులో ఏపీలో ఎవరితో జట్టు కట్టలనేది రాహుల్ వ్యూహం..అయితే రాహుల్ చేయించిన సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి../br>

రాహుల్ సర్వే ప్రకారం చూసుకుంటే ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఒక్క వైసీపి కి మాత్రమే ఉందని ఆ సర్వే తాలూకు ఫలితాలు చెప్తున్నాయి..ప్రస్తుతం ఉన్న 175 స్థానాల్లో వైసీపీకి 110 సీట్లు వస్తాయని..టీడీపీ 55 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని సమాచారం. ఇక జిల్లాల విషయానికొస్తే కర్నూలు జిల్లాలో వైసీపీ ప్రభావం కొద్దిగా తగ్గనుందని తెలుస్తోంది అయితే టిడిపికి ఎంతో కీలకమైన చోటయిన పశ్చిమ గోదావారి ఈ సారి వైసీపి వశం కాబోతోంది అంటున్నారు. అయితే ఇప్పటి వరకూ వచ్చిన నాలుగు సర్వేలలలో చేరి రెండు టిడిపి వైసీపి కి అనుకూలంగా రాగా..ఐదో సర్వే అయిన రాహుల్ సర్వే జగన్ కి అనుకూలంగా రావడంతో వైసీపి నేతలు ఫుల్ల్ కుషీగా ఉన్నారు అయితే ఎన్ని సర్వేలు వచ్చినా సరే ఫైనల్ గా రిజల్ట్స్ ఇచ్చేది మాత్రం ఓటర్లే.