ట్రాక్టర్ పై సోఫా ఏంటి రాహుల్ !

ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసినా తప్పు పట్టడం కాంగ్రెస్ కు అలవాటే.అయితే కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం పంజాబ్ లో ఆందోళన చేపట్టారు.

 Punjab Farm Laws Protest, Rahul Gandhi Tractor Rally, Kisan Bacho Rallies, Rahul-TeluguStop.com

ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.అయితే ర్యాలీలో రాహుల్ గాంధీ కూర్చున్న ట్రాక్టర్ పై రెక్లైనర్ సోఫా ను అమర్చి రైతు మనోభావాలని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు.నిజంగా రైతుల సమస్యలపై పోరాటం చేయాలి అని అనుకుంటే ఇలా ట్రాక్టర్ పై సోఫా అమర్చేవాడు కాదని, రైతులను తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి ట్విటర్ వేదికగా రాహుల్‌ను విమర్శించారు.‘కాంగ్రెస్ ప్రారంభించిన నిరసన పూర్తిగా రాజకీయ ఆందోళనే.నూతన వ్యవసాయ చట్టంతో కొందరి స్వార్థ ప్రయోజనాలు దెబ్బతిన్నాయి.వారే ఈ నిరసన చేస్తున్నారు’ అని హర్దీప్ సింగ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.ఇలా ట్రాక్టర్లపై సోఫాలు వేసుకోవడం నిరసన అనిపించుకోదని రాహుల్‌ను ఎద్దేవా చేశారు.ఇది రైతులను తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న ‘ఆందోళనని’ అని హర్‌దీప్ సింగ్ దుయ్యబట్టారు.

మరి దీనికి రాహుల్ గాంధీ ఏం సమాధానం చెప్తాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube