అధికారంలోకి వస్తే ముందు మోడీ అంతు చూస్తా! రాహుల్ సంచలన వాఖ్యలు  

మోడీని జైలుకి పంపిస్తా అని సంచలన వాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ..

Rahul Gandhi Sensational Comments On Modi Once Again-congress,lok Sabha Elections,modi,rahul Gandhi Sensational Comments

దేశం అంతా ఇప్పుడు లోక్ సభ ఎన్నికల వైపు చూస్తుంది. అధికార పార్టీ బీజేపీని ఎలా అయినా ఈ సారి గద్దె దించి తాను ప్రధాని పీఠం మీద కూర్చోవాలని రాహుల్ గాంధీ కలలు కంటున్నారు. ఇంతకాలం రాజకీయాలలో పప్పు అనే ముద్రతో కొంత ప్రజా వ్యతిరేకతని ఎదుర్కొన్న రాహుల్ ప్రస్తుతం మాత్రం మోడీకి గట్టి ప్రత్యర్ధిగా తన మాటలతో, చేతలతో ప్రజలతో అనిపించుకుంటున్నాడు..

అధికారంలోకి వస్తే ముందు మోడీ అంతు చూస్తా! రాహుల్ సంచలన వాఖ్యలు-Rahul Gandhi Sensational Comments On Modi Once Again

ప్రస్తుతం మోడీకి దేశంలో కొంత వ్యతిరేక పవనాలు వీస్తూ ఉండటంతో తనకి కలిసొస్తుందని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. తన తండ్రి, భామ్మ వారసత్వంని కొనసాగించాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే లోక్ సభ ఎన్నికల ప్రచారంలో తన మాటలతో వేడి పుట్టిస్తున్న రాహుల్ గాంధీ మోడీని లక్ష్యంగా చేసుకొని ప్రజలలోకి వెళ్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఎన్నికల ప్రచారంలో రాహుల్ మరో సారి సంచలన వాఖ్యలతో కాక రేపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముందుగా రాఫెల్ కుంభకోణం మీద విచారణ జరిపించడంతో పాటు ఇందులో ప్రధాన ముద్దాయిగా మోడీని జైలుకి పంపించడం గారంటీ అని వాఖ్యలు చేసారు. మోడీని జాలు ఊచలు లెక్క పెట్టడానికి సమయం ఎంతో లేదని తొందరలోనే అది జరుగుతుందని ఘాటు వాఖ్యలు చేసారు.