రాహుల్ తో బాబు రహస్య చర్చలు..సీన్లోకి ఆ పత్రిక అధిపతి.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసలు గేమ్ చాల వేగంగా మొదలు పెతున్నారని తెలుస్తోంది.రాజకీయాలలో ప్రత్యర్దులని ఎదుర్కోవాలి అంటే ఆ ప్రత్యర్ధుల శత్రువులతో సహవాసం చేయక తప్పదు ఇప్పుడు ఈ విధానాన్ని బాబు అనుసరిస్తున్నారు.

 Rahul Gandhi Meeting With Chandrababu Naidu-TeluguStop.com

జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు చంద్రబాబు కాంగ్రెసుతో చేతులు కలపడానికి సిద్దమైనట్లుగా తెలుస్తోంది కూడా.అయితే అందుకు తగ్గట్టుగానే చర్చలు నడుపుతున్నారని అయితే ఇప్పటికే కొన్ని చర్చల ఫలితంగా కొంతమంది కాంగ్రెస్ నేతలని టీడీపీ లోకి చేర్చుకునే విధంగా ప్లాన్ కూడా చేశారట.

అయితే ఈ క్రమంలోనే తెలంగాణా కాంగ్రెస్ కీలక నేత ఒకరు ఇటీవలే అమరావతిలో చంద్రబాబు ని కలిసి సమావేశం అయ్యారని తెలుస్తోంది.రెండ్రోజులపాటు అక్కడే ఉన్న ఎమ్మెల్యే రెండుసార్లు చంద్రబాబుతో రహస్యంగా సమావేశమయ్యారని చెబుతున్నారు…రాహుల్‌గాంధీకి సలహాదారుగా ఉన్న ఓ మాజీ బ్యూరోక్రాట్‌కు ఈ ఎమ్మెల్యే అత్యంత సన్నిహితుడని పొత్తు ప్రతిపాదనపై చంద్రబాబుతో చర్చించేందుకు కాంగ్రెసు అధిష్టానం ఆయన్ని పంపిందని టాక్ వినిపిస్తోంది.

అయితే గన్‌మెన్, డ్రైవర్‌ లేకుండా తానే సొంతంగా వాహనాన్ని నడుపుకుంటూ వెళ్లిన ఆ ఎమ్మెల్యే విజయవాడలో రెండ్రోజులు ఉంటూ మొదటి రోజు చంద్రబాబుతో సమావేశమైనప్పుడు ఆ విషయాలు రాహుల్ కి వివరించారని అయితే తరువాత రాహుల్ తో మాట్లాడిన మాటలు మళ్ళీ చంద్రబాబు తో చర్చించి వెళ్ళారని తెలుస్తోంది.ఇదిలాఉంటే వచ్చే ఎన్నికలకు పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు లభించే శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో తన మాట చెల్లుబాటు కావాలనే వ్యూహంతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నట్లు చెబుతున్నారు.

అంతేకాదు బాబు సూచనల మేరకే జగన్ కి చెక్ పెట్టె దిశగా కిరణ్ ని కాంగ్రెస్ లోకి తీసుకుంటున్నట్టుగా సమాచారం ఉందని.టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తులో భాగంగా శ్రీకాకుళం లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీకి కేటాయించాలన్నది చంద్రబాబు వ్యూహమని వార్తలు వచ్చాయి.

కాంగ్రెసు నుంచి ఓ పారిశ్రామికవేత్తను పోటీకి దించేందుకు చంద్రబాబు కసరత్తు చేసినట్లు కూడా చెబుతున్నారు…తమ పార్టీలో టికెట్లు దక్కని వారు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరకుండా జాగ్రత్త పడవచ్చుననేది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు.

అయితే వారంతా కాంగ్రెసులోకి వెళ్తే జగన్ కు చెక్ పెట్టడానికి వీలవుతుందనేది చంద్రబాబు వ్యూహంలోని ప్రధానాంశమని అంటున్నారు…అయితే ఈ చర్చల్లో బాబు తో పాటుగా ఓ పత్రికాధిపతి కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఏది ఏమైనా సరే ఇప్పుడు బాబు ముందున్న టార్గెట్ ఒక్కటే జగన్ కి ఎలా అయినా సరే అధికారం రాకుండా కట్టడి చేయడమే ఇప్పుడు చంద్రబాబు ముందున్న టార్గెట్ అంటున్నారు నేతలు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube