రాహుల్ దూకుడు తో..షాక్ తింటున్న “మోడీ ..షా”     2018-06-13   03:04:05  IST  Bhanu C

పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు..మనుషుల తీరు తెన్నులు కూడా ఎప్పుడు ఒకేలా ఉండవు..ఇది నిత్య సత్యం..మనిషి తనకి జరిగిన అనుభవాలని బట్టి ఎప్పటికప్పుడు తనని తానూ మార్చుకుంటూ ఉంటాడు..ఈ క్రమంలో ఎన్నో అవమానాలు ఎన్నో భాధలు..మరిన్నో ఎత్తుపల్లాలు చవి చూస్తాడు రాటుదేలిన మనిషిలా మారుతాడు అందుకే అంటారు ఉపాద్యాయుడు విద్యని నేర్పితే సమాజం బ్రతకడం నేర్పుతుంది అంటారు..ఇప్పుడు రాహుల్ గాంధీ విషయంలో కూడా ఇదే రుజువయ్యింది..

రాహుల్ గాంధీకి మోడీ ని డీ కొట్టే సత్తా లేదు అతడు ఒక పప్పు అంటూ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చరిష్మా పెరగకుండా ఎప్పటికప్పుడు తన వ్యక్తులతో సోషల్ మీడియాతో అన్ పాప్లర్ చేస్తూ రాహుల్ ని ఎదగకుండా చేయాలనీ అనుకున్నాడు అయితే రాహుల్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వకుండా తన సొంత ఇమేజ్ ని పెంచుకోకుండా అటు పార్టీ ఇటు తల్లి ఇమేజ్ తో తల్లి చాటు బిడ్డలా అయిపోయాడు..అయితే క్రమక్రమంగా రాహుల్ తనని తానూ మార్చుకుంటూ వచ్చాడు..తనకున్న పప్పు మార్క్ ని పూర్తిగా మార్చుకున్నాడు