రాహుల్ దూకుడు తో..షాక్ తింటున్న “మోడీ ..షా”       2018-06-13   03:04:05  IST  Bhanu C

పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు..మనుషుల తీరు తెన్నులు కూడా ఎప్పుడు ఒకేలా ఉండవు..ఇది నిత్య సత్యం..మనిషి తనకి జరిగిన అనుభవాలని బట్టి ఎప్పటికప్పుడు తనని తానూ మార్చుకుంటూ ఉంటాడు..ఈ క్రమంలో ఎన్నో అవమానాలు ఎన్నో భాధలు..మరిన్నో ఎత్తుపల్లాలు చవి చూస్తాడు రాటుదేలిన మనిషిలా మారుతాడు అందుకే అంటారు ఉపాద్యాయుడు విద్యని నేర్పితే సమాజం బ్రతకడం నేర్పుతుంది అంటారు..ఇప్పుడు రాహుల్ గాంధీ విషయంలో కూడా ఇదే రుజువయ్యింది..

-

రాహుల్ గాంధీకి మోడీ ని డీ కొట్టే సత్తా లేదు అతడు ఒక పప్పు అంటూ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చరిష్మా పెరగకుండా ఎప్పటికప్పుడు తన వ్యక్తులతో సోషల్ మీడియాతో అన్ పాప్లర్ చేస్తూ రాహుల్ ని ఎదగకుండా చేయాలనీ అనుకున్నాడు అయితే రాహుల్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వకుండా తన సొంత ఇమేజ్ ని పెంచుకోకుండా అటు పార్టీ ఇటు తల్లి ఇమేజ్ తో తల్లి చాటు బిడ్డలా అయిపోయాడు..అయితే క్రమక్రమంగా రాహుల్ తనని తానూ మార్చుకుంటూ వచ్చాడు..తనకున్న పప్పు మార్క్ ని పూర్తిగా మార్చుకున్నాడు

ఈ మధ్య కాలంలో రాహుల్ దూకుడు చూసి ఎంతో మంది నేతలు ఆశ్చర్యపోతున్నారు..రాహుల్ తన ప్రత్యర్థి అయిన మోడీపై వార్ ప్రకటించారు…ఏ చిన్నపాటి అవకాశం లభించినా.. మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. గతానికి భిన్నంగా రాహుల్ తన ఫైరింగ్ స్టైల్ ను మార్చినట్లుగా కనిపిస్తోంది. సూటిగా కాకుండా.. తెలివిగా వ్యవహరిస్తూ.. మోడీని ఆత్మరక్షణలో పడేసేలా రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ పండితులని సైతం విస్తుపోయేలా చేస్తున్నాయి.

అయితే దీనికి నిదర్సనం తాజాగా రాహుల్ చేసిన వ్యాఖ్యలు…జాతిపిత మహాత్మ గాంధీని చంపింది సంఘ్ పరివార్ అంటూ వ్యాఖ్యలు చేయటం ద్వారా కేసులు ఎన్నో కేసులని ఎదుర్కొంటున్న రాహుల్.. తాను చెప్పిన మాటల్లో ఎలాంటి తప్పు లేదని చెప్పారు…కోర్టు కేసుకు హాజరైన ఆయన తనపై బీజేపీ సంఘ్ పరివార్ లు ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చన్నారు మీకు ఎన్ని కేసులు పెట్టుకునే ఓపిక ఉందొ అంటూ చమత్కరించారు కూడా…అయితే

మాకు రాజకీయంగా ఎన్నో విభేదాలు మీతో ఉండవచ్చు కానీ ఎన్ని ఉన్నా సరే ఆసుపత్రిలో వాజ్ పేయ్ ను మొదట పరామర్శించింది తానేనని చెప్పారు…ఇది కాంగ్రెస్ సంస్కారం అని అన్నారు.అంతేకాదు రాహుల్ మోడీ గురువు అద్వానీ ప్రస్తావన తీసుకొచ్చారు…అద్వాని జీ కి బీజేపి కంటే కూడా కాంగ్రెస్ ఎక్కువగా గౌరవం ఇచ్చిందని అన్నారు..బీజేపి ని ఒంటి చేత్తో గెలిపించిన అద్వాని పరిస్థితి మరీ అధ్వానంగా తయారయ్యింది అని అన్నారు..ఆయన్ని చూస్తుంటే జాలి కలుగుతుందని అన్నారు ఈ మొత్తం వ్యవహారం చాలు మోడీ పై రాహుల్ చెప్పటం ద్వారా.. రాహుల్ తన తీరును మార్చుకోవటమే కాదు.. మోడీపై కాంగ్రెస్ ఎక్కుపెట్టిన తిరుగులేని బాణం రాహుల్ అని చెప్పడానికి అంటున్నారు రాజకీయ పండితులు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.