ప్రియాంకా పోటీపై రాహుల్ నిర్ణయమే ఫైనల్! ఆమె డిసైడ్ చేసేసింది  

తన పోటీపై రాహుల్ గాంధీ నిర్ణయమే ఫైనల్ అన్న ప్రియాంకా వాద్రా. .

Rahul Gandhi Have Final Decisions On Priyanka Gandhi Contest In Varanasi-congress Party,priyanka Gandhi Contest,rahul Gandhi Have Final Decisions,varanasi

లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్ధి రాహుల్ గాంధీకి తోడుగా అతనిని గెలిపించి ప్రధాని చేయాలనే లక్యం‌ తో చెల్లి ప్రియాంకా వాద్రా కూడా రాజకీయ ప్రస్తానం మొదలెట్టింది. ఎఐసిసి ప్రధాన కార్యదర్శిగా బాద్యతలు తీసుకొని కాంగ్రెస్ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తుంది. తమ మాటల వేడితో ప్రధానికి సైతం చురకలు అంటిస్తూ ముందుకి సాగిపోతుంది..

ప్రియాంకా పోటీపై రాహుల్ నిర్ణయమే ఫైనల్! ఆమె డిసైడ్ చేసేసింది-Rahul Gandhi Have Final Decisions On Priyanka Gandhi Contest In Varanasi

ఈమె ఎక్కువగా యూపీపైనే ద్రుష్టి పెట్టింది. ఇదిలా ఉంటే ఆమె వారణాసి నుంచి ప్రధాని మోడీ మీద పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి వినిపిస్తుంది. ఇప్పటికే వారణాసిలో గెలుపుని ఖాయం చేసుకున్న మోడీ మీద అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎవర్ని బరిలో దించిన పోటీ ఇచ్చే అవకాశం చాలా తక్కువ.

అందుకని నేరుగా ప్రియాంకా వద్రాని బరిలో నిలపాలని అక్కడి స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా కోరుతున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ప్రియాంకా స్పందించలేదు. తాజాగా ఆమె ఈ విషయంపై మాట్లాడుతూ వారణాసిలో తను పోటీ చేసే విషయంలో అన్న నిర్ణయమే ఫైనల్ అని చెప్పీసింది.

అతను ఆదేశిస్తే కచ్చితంగా పోటీ చేస్తా అని స్పష్టం చేసింది. అయితే రాహుల్ గాంధీ మాత్రం ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వేచి చూసే ధోరణిలో ఉన్నారని తెలుస్తుంది.