రాహుల్ ఇరకాటంలో పడ్డాడా..? టి.కాంగ్రెస్ రాజకీయాలు అర్ధంకావడంలేదా ..?

దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీస్తుండడంతో కాంగ్రెస్ లో కొత్త ఆశల చిగురులు పుట్టుకొస్తున్నాయి.ఏదోవిధంగా అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ రధసారధి రాహుల్ రంగంలోకి దిగి అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ను బలోపేతం చేసే పనిలో పడ్డాడు.

 Rahul Gandhi Gets Headache With Telangana Congress-TeluguStop.com

అయితే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు రాహుల్ కి ఏమాత్రం అర్ధంకాకపోగా .అక్కడ నాయకుల మధ్య ఏర్పడిన ఆధిపత్య పోరుతో పార్టీ పరిస్థితి దిగజారుతుండడంతో రాహుల్ ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.తెలంగాణాలో పార్టీ ప్రక్షాళన ఎలా చేయాలో తెలియక ఆయన తికమకపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.దాదాపు ఆరు నెలల నుంచి టీ కాంగ్రెస్ పునర్ వ్యవస్థీకరణ వ్యవహారం ఓ కొలిక్కి రాకపోవడమే దీనికి నిదర్శనం.

రాహుల్ ను అంతగా ఇబ్బందిపెడుతున్న అంశాలు చాలానే ఉన్నాయట.ఇందులో ముఖ్యంగా టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్రే కీలకంగా కనిపిస్తోంది.అదృష్టం కలిసి వస్తే 2019లో ముఖ్యమంత్రి అయిపోవాలని ఉత్తమ్ ఉవ్విళ్లూరుతున్నారు.ఈ క్రమంలోనే ఆయన మిగతా కాంగ్రెస్ నాయకులతో వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ లో కాకలు పుట్టిస్తోంది.

దాదాపు ఆరు నెలల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

టీ కాంగ్రెస్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఏఐసీసీ అధిష్టానానికి ఉత్తమ్ ఇచ్చిన జాబితా చూసిన హైక‌మాండ్ పున‌రాలోచ‌న‌లో ప‌డింది.

సామాజిక న్యాయం ముసుగులో ఉత్తమ్ తన మాట వినే వారికి పదవుల పంపకంలో పెద్దపీట వేస్తూ ఏఐసీసీకి జాబితా ఇచ్చార‌ని తెలుస్తోంది.అదీ కాకుండా రేవంత్ రెడ్డికి ప్రచార కమిటీ ఇవ్వడానికి ఉత్తమ్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు.

తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలంటే ఉత్తమ్ ను పీసీసీ నుంచి తప్పించాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలను డిమాండ్ చేస్తున్నాడట.అంతే కాకుండా .టి.కాంగ్రెస్ లో ముఖ్య నేతలుగా ఉన్న డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, జైపాల్ రెడ్డి లాంటి నాయకులు ఎటువంటి కీలక పదవులు ఇవ్వాలి .పదవుల పంపకంలో అలకలు వస్తే పార్టీ పరిస్థితి ఏంటి అనే విషయాలపై రాహుల్ ఆందోళన చెందుతున్నాడట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube