'ఆ నినాదం'...కలిసోస్తుందా..రాహుల్ జీ..???

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ జనాకర్ష పధకాలకి వ్యూహరచన చేస్తోంది.వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు అందుకోవాలని, పదేళ్ళ నిరీక్షణకి ఎలాగైనా చరమగీతం పాడాలని, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తరాగం అందుకోబోతోంది.

 Rahul Gandhi Following His Grandmother Polacy-TeluguStop.com

ఓటర్లని తమవైపుకి తప్పుకోవడానికి తగినని వ్యుహాలని తన అమ్ముల పోలదిలో సిద్దంగా ఉంచుతోంది.ఈ నేపధ్యంలోనే “గరీబీ హఠావో” అంటూ మాజీ ప్రధాని ఇదిరాగాంధీ పలికిన నినాదాన్ని మళ్ళీ ఇప్పుడు ఆమె మనుమడు రాహుల్ గాంధీ అస్త్రంగా మలుచుకోబోతున్నాడు.

ఈ క్రమంలోనే రాహుల్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పకుండా దేశంలో పేదలు అందరికి కనీస ఆదాయ భద్రత కలిపించి పేదరికాన్ని రూపు మాపుతామని వాగ్ధానం ఇస్తున్నారు.ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన రైతుల ర్యాలీలో ఆయన ఈ విధంగా ప్రసంగించారు.పేదలకోసం ఏ పార్టీ తీసుకొని నిర్ణయం మేము తీసుకోబోతున్నాం అయితే మీరు మన ప్రభుత్వాన్ని వచ్చేలా కాంగ్రెస్ కి ఓటు వేయాలి అంటూ ప్రసంగించారు.దేశంలో ఉన్న ప్రతీ పేదవాడు కనీస ఆదాయం కలిగి ఉంటారు, ఆకలి బాధలు ఉండవు అంటూ వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ ప్రభుత్వం రైతులని పట్టించుకోవడం లేదు.రైతుల రుణాలు మాఫీ చేయాలని అడిగితే మావద్ద డబ్బులు లేవని చేతులు ఎత్తేస్తోంది.

అంటూ రాహుల్ మోడీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు.రైతులకు సాయం చేయడానికి డబ్బు లేదు అంటున్న ఈ ప్రభుత్వం ఏకంగా దాదాపు 15 మంది బడా పారిశ్రామిక వేత్తలకి ఋణాలు ఎలా మాఫీ చేసింది అంటూ మోడీ ని రైతుల సభలో ఇరకాటంలోకి నెట్టారు రాహుల్.

అయితే రాహుల్ చేసిన వ్యాఖ్యలకి బీజేపీ సైతం గట్టిగా కౌంటర్ ఇచ్చింది.కాంగ్రెస్ ఇచ్చిన వందల హామీలలో కనీస ఆదాయ భద్రత ఒకటని , వాటిని అమలు చేయడం ఆపార్టీకి కుదరదని ప్రకటించింది.కాని తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఎంతో వ్యుహత్మకమని అంటున్నారు పరిశీలకులు.ఏది ఏమైనా సరే పేదల ఓట్లు ఆకర్షించడానికి రాహుల్ ఇందిర నినాదాన్ని ఎత్తుకోవడం కాంగ్రెస్ పార్టీ కి మళ్ళీ అధికారాన్ని తెచ్చి పెడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube