టీపై రాహుల్‌ ఫోకస్‌.. ఫలితం ఉండేనా?  

Rahul Gandhi Focus On Telangana -

సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది.కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం అవుతుందనే ఉద్దేశ్యంతో సోనియా గాంధీ 2014 ప్రత్యేక రాష్ట్రంకు ఓకే చెప్పారు.

రాష్ట్రం ఇచ్చాం కనుక తెలంగాణలో సింపుల్‌గా గెలిచేస్తాం అని కాంగ్రెస్‌ నాయకులు అనుకున్నారు.కాని అనూహ్యంగా రాష్ట్రం తెచ్చింది తాను అంటూ కేసీఆర్‌ సీఎం అయ్యాడు.

టీపై రాహుల్‌ ఫోకస్‌.. ఫలితం ఉండేనా-Political-Telugu Tollywood Photo Image

ఏపీలో పార్టీని భూస్థాపితం చేసి తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌కు ఫలితం దక్కలేదు అనేది అందరు చెప్పే మాట.అయితే తెలంగాణలో కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉందనేది రాజకీయ విశ్లేషకుల వాదన.టీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టగల సత్తా కాంగ్రెస్‌కు ఉందని, 2019లో గట్టిగా కష్టపడితే ఖచ్చితంగా కాంగ్రెస్‌కు అధికారం దక్కే అవకాశం ఉందని రాహుల్‌ గాంధీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ ఎంపిక అయిన తర్వాత తెలంగాణలో పార్టీ పరిస్థితి గురించి పలు సార్లు నాయకులతో చర్చించడం జరిగింది.

తాజాగా మరోసారి కూడా తెలంగాణ నాయకులతో రాహుల్‌ గాంధీ చర్చించినట్లుగా తెలుస్తోంది.తాజాగా సీడబ్ల్యూసీ మీటింగ్‌ జరిగింది.ఆ తర్వాత టీ నాయకులతో రాహుల్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యి వారికి దిశా నిర్థేశం చేసినట్లుగా నాయకులు చెబుతున్నారు.తెలంగాణలో పార్టీకి మంచి క్యాడర్‌ ఉంది, దాన్ని ఉపయోగించుకుని వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పార్టీలో ఉండే గ్రూప్‌లను పక్కన పెట్టి అందరు కష్టపడాలని, 2019 ఎన్నికలకు ఇప్పటి నుండే కృషి చేయాలి అంటూ సూచించాడు.టీలో ప్రభుత్వం ఏర్పాటుతో పాటు 8కి మించి పార్లమెంటు స్థానాలను దక్కించుకోవాలనే పట్టుదలతో నాయకులు ముందుకు సాగాలని రాహుల్‌ గాంధీ సూచించారు.ఇప్పుడే ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి చర్చించుకుంటూ ప్రజల్లో చులకన అవ్వొద్దు అని హెచ్చరించాడు.పార్టీలో ప్రతి ఒక్కరిని కలుపుకు పోవాలని, ఇతర పార్టీల నుండి ముఖ్యంగా అధికార పార్టీ నుండి కొందరు నాయకులను అయినా కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు ప్రయత్నించాల్సిందిగా రాహుల్‌ సూచించాడు.

రాహుల్‌ సూచనలతో తెలంగాణ కాంగ్రెస్‌కు బలం చేకూరుతుంది.కాని ఆ సూచనలను టీ కాంగ్రెస్‌ నాయకులు పాటించేది అనుమానమే.

కాంగ్రెస్‌ అంటేనే గ్రూప్‌ రాజకీయాలు.చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంతా కూడా తామే అంతా అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు.

కాంగ్రెస్‌ నాయకుల్లో పదుల సంఖ్యలో ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు.తమకు తాముగా ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ పలువురు ప్రకటించుకుంటున్నారు.

ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీకి అధికారం దక్కడం కష్టమే, అయితే అసాధ్యం మాత్రం కాదు.మరి ఎన్నికల వరకు అయినా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాహుల్‌ గాంధీ సూచనల మేరకు పని చేస్తారేమో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test