అథ్లెట్లకు పాత నజరాలు చెల్లించండి.. వీడియో కాల్స్ ఆపండి.. రాహుల్ ఫైర్..!

టోక్యో ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాల్స్ మాట్లాడుతున్నారు.పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అథ్లెట్లపై కానుకలను ప్రకటించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు.

 Rahul Gandhi Fires On Rewards For Athletes , Rahul Gandhi,  Athletes , Olympic P-TeluguStop.com

టోక్యో ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన వారిలో 2018లో ఆసియా క్రీడల నాటి నజరానాలే అందలేదని వచ్చిన మీడియా కథనాలతో రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.పతకాలు గెలవగానే వారితో వీడియో కాల్స్ మాట్లాడేందుకు ఆసక్తి చూపిస్తున్న నేతలు వారికి శుభాకాంక్షలు తెలపడం కంటే పాత బకాయిలు చెల్లించడంపై దృష్టి పెడితే మంచిదని అన్నారు రాహుల్ గాంధీ.

శుభాకాంక్షలతో పాటు అథ్లెట్ల పాత బకాయిలు కూడా ఇచ్చేయండి అని అన్నారు.క్రీడల బడ్జెట్లలో కోతలు విధించడం సరైనది కాదు.

వీడియో కాల్స్ ఆపి తక్షణమే వారికి ఇవ్వాల్సిన నజరాలా గురించి ఆలోచించండి.అవి వెంటనే ఇచ్చేయండి అని రాహుల్ గాంధీ అన్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియాలో కథనం ఆధారంగా రాహుల్ ఈ కామెంట్స్ చేయడం విశేషం.హర్యానా ఒలింపియన్లు తమ కానుకల కోసం నాలుగేళ్ళు గా ఎదురుచూస్తున్నారనే కథనం టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది.

అథ్లెట్ల నజరానా ప్రకటించిన రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఉంది.పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube