ఈ మోడీకి దమ్ముంటే ఆ మోడీని పట్టుకు రావాలట

ఈ మోడీ ఎవరు? ఆ మోడీ ఎవరు? ఈ మోడీ ప్రధాని నరేంద్ర మోడీ.ఆ మోడీ అవినీతి ఆరోపణలతో దేశం నుంచి పారిపోయిన ఐ పీ ఎల్ మాజీ బాస్ లలిత్ మోడీ.

 Rahul Gandhi Dares Pm To Bring Back Lalit Modi-TeluguStop.com

దమ్ముంటే విదేశాల నుంచి లలిత్ మోడీని తీసుకు రావాలని గురువారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి పార్లమెంట్లో ప్రధాని మోడీని సవాల్ చేసారు.ప్రధానికి ఇది మంచి అవకాశమని అన్నారు.

లలిత్ మోడీని ఇండియాకు రప్పించి క్రికెట్ కుంభకోణం నిగ్గు తేల్చాలని రాహుల్ డిమాండ్ చేసారు.ఈ దేశాన్ని ఆర్ ఎస్ ఎస్ నుంచి, నరేంద్ర మోడీ నుంచి రక్షించడానికే తాను ఉన్నానని రాహుల్ ప్రజలకు భరోసా ఇచ్చారు.

నల్ల డబ్బు-రాజకీయ వ్యవస్థ మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని ప్రజలు క్రమంగా అర్ధం చేసుకుంటున్నారని అన్నారు.ప్రధాని మోడీ ధైర్యం లేని వ్యక్తీ అని యువ రాజు ఘాటుగా విమర్శించారు.

తాము ఎన్నికల్లో వోడిపోయిన తరువాత మోడీ బలమైన నాయకుడని భావించానని, కాని ఆయనకు అంత సీన్ లేదని అర్ధమైందని రాహుల్ చెప్పారు.మొత్తం మీద రాహుల్ చాలా గట్టిగా మాట్లాడటం నేర్చుకున్నారు.

సెలవు పెట్టి విదేశాలకు వెళ్ళిన యువరాజు శక్తి పుంజుకొని వచ్చినట్లు కనబడుతున్నది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube