బ్రేకింగ్..ఏపీలో ఆ స్థానం నుంచీ రాహుల్ పోటీ       2018-06-23   22:46:50  IST  Bhanu C

చంద్రబాబు వ్యూహాలు అంతుచిక్కడం చాలా కష్టం ఒకానొక సమయంలో చంద్రబాబు తీసుకుని నిర్ణయాలు పరిసీలకులని సైతం విస్తు పోయేలా చేస్తాయి… బాబు ఖచితమైన టార్గెట్ తెలియక జుట్లు పీక్కునే పరిస్థితికి వస్తుంది..అదేమంటే ఇదంతా చంద్రబాబు లీలా మహిమ అనాల్సిందే..అయితే ఇప్పుడు అదే విధమైన ఒక వ్యూహాత్మకమైన ప్లాన్ వేశారు చంద్రబాబు..ఊహలకందని స్కెచ్ లు చంరబాబు దిట్ట అనే విషయం తెలిసిందేకదా సరే ఇంతకీ అసలు విషయం ఏమింటే..

ఏపీలో అసలు కోలుకోవడానికే అవకాశం లేకుండా బక్క చిక్కిపోయిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడు ఏపీలో మళ్ళీ పూర్వ వైభవం వస్తుందా అంటూ ఎప్పుడు ఏపీలో పాగా వేద్దామా అని ఆలోచిస్తోంది..అందుకు గాను సర్వశక్తులు ఒడ్డుతోంది అధిష్టానం..అయితే ఇప్పుడు తన రాజకీయ ఎత్తులకోసం ఏపీలో కి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు ప్రాణం పోయనున్నారని తెలుస్తోంది..ఈ క్రమంలోనే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఆలోచించారు…అదేంటంటే

రాయలసీమలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉందంటే అది రెడ్ల ఓట్లే..ఇప్పుడు ఆ ఓటు బ్యాంక్ ని చీల్చడానికి బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు..అందుకు తగ్గట్టుగానే రాహుల్ గాంధీని కర్నూలు జిల్లా నంద్యాల నుంచి పోటీ చేయించాలని ఆలోచిస్తున్నారు..అయితే రాహుల్ అమేధీ నుంచీ పోటీ చేస్తూనే రెండో స్థానం ఏపీ నుంచీ బరిలోకి దిగుతున్నారు.. దీనివల్ల చంద్రబాబు కి కలిసొచ్చే విషయం ఏమిటంటే..కాంగ్రెస్ మైలేజ్ పెరుగుతుంది. తద్వారా జగన్ ఓటు బ్యాంక్ కు గండి పడుతుంది. మరో రకంగా రెడ్లు మళ్లీ కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది.. ఇదే జరిగితే మాత్రం జగన్ కి కోలుకోలేని దెబ్బ పడినట్లే అనేది బాబు వ్యూహం..

అయితే ఇటీవలే బెంగళూరులో రాహుల్ గాంధీ చేతిలో చేయి వేసి మరీ భంధం ఇలానే ఉండాలి అనేట్టుగా సిగ్నల్స్ ఇచ్చిన బాబు అక్కడే ఈ వ్యుహాలకి పదును పెట్టరనియా తెలుస్తోంది..అందుకే రెండు రోజుల క్రితం కూడా రాహుల్ జగన్ మా శత్రువు అంటూ ప్రతిపక్ష పార్టీ పై నిప్పులు చెరిగారు..అసలు అధికార పక్షం ని వదిలేసి ప్రతిపక్షం పై వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే భవిష్యత్తులో బాబు ,రాహుల్ గాంధీ కలుస్తారా అనేఅ విషయం మరింత ఆసక్తిని రేపుతోంది..అంతేకాదు రాహుల్ గాంధీ తమ పార్టీ భవిష్యత్తు ని ద్రుశ్తిలొఅ పెట్టుకుని బాబు చెప్పింది ఫాలో అవుతున్నారని తెలుస్తోంది..ఏది ఏమైనా చంద్రబాబు లాంటి చాణిక్యుడు మరొకరు ఉండరు సుమీ అంటున్నారు విశ్లేషకులు…మరి ఈ విషయం పై పిల్ల కాంగ్రెస్ వైసీపి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.