కరోనా బీభత్సం.. ప్రచారం రద్దు చేసుకున్న రాహుల్ గాంధీ..!

కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో ఉండటంతో దేశ ప్రజలు మళ్లీ ఇబ్బందులు పడుతున్నారు.కరోనా వ్యాప్తి పతాకస్థాయికి చేరుకోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టెన్షన్ పెట్టిస్తుంది.

 Rahul Gandhi Canceled Meetings Bengal Campign Corona Pandemic, Bengal , Campign,-TeluguStop.com

ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్ లో సభలు సమావేశాల్లో పాల్గొనబోనని ప్రకటించారు.పశ్చిమ బెంగాల్ లో 5 విడతల అసెంబ్లీ ఎన్నికలు మిగిశాయి అయితే మరో 3 విడతల ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.

కరోనా వ్యాక్తి కారణంగా తాను బెంగాల్ లో సభలు, సమావేశాల్లో పాల్గొనని చెప్పారు రాహుల్ గాంధీ.బెంగాల్ లో తాను పాల్గొనాల్సిన సభలను రద్ధు చేస్తున్నట్టు చెప్పారు.

రాజకీయ నేతలందరూ ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు రాహుల్.

అయితే పశ్చిమ బెంగాల్ లో అధికార టీ.

ఎం.సీ, బీజేపీ మధ్య గట్టి పోటీ జరుగుతుంది.అక్కడ కాంగ్రెస్ కు పెద్దగా ఓట్లు పడే అవకాశం కనిపించడం లేదు.రాహుల్ సభలు రద్ధు చేసుకున్నా కాంగ్రెస్ కు కలిగే నష్టం ఏమి లేదని అంటున్నారు.

అయితే రాహుల్ లానే మిగతా పార్టీలు కూడా తమ ప్రచారాలను ఆపేస్తారా సభలు సమావేశాలు క్యాన్సల్ చేస్తారా లేదా అన్నది చూడాలి.కాంగ్రెస్ నుండి రాహుల్ రాకపోయినా సరే కాంగ్రెస్ తరపున నిలబడిన నాయకులు మాత్రం సభలు నిర్వహిస్తారని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube