ఆయనపైనే రాహుల్ ఆశలు ! కాంగ్రెస్ దశ దిశా మార్చుతారా ? 

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు బలమైన పునాదులు వేసేందుకు, రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లోనూ విజయం సాధించి , కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే విధంగా రాహుల్ ప్రయత్నాలు చేస్తున్నారు .ఈ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతున్నట్లు గానే కనిపిస్తున్నాయి.

 Rahul Gandhi Believes That Congress Will Come To Power With Prashant Kishores Political Tactics-TeluguStop.com

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభావం పూర్తిగా పడిపోయింది అనుకున్న సమయంలో రాహుల్ నిర్ణయాలు కాంగ్రెస్ కు బూస్ట్ గా పనిచేస్తున్నాయి.చాలా రాష్ట్రాల్లో పార్టీ  పుంజుకోవడమే కాకుండా, ఇటీవల వివిధ రాష్ట్రాల్లో నియమించిన పిసిసి అధ్యక్షులు పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.
   కాంగ్రెస్ సీనియర్ల నుంచి ఈ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమయినా, పిసిసి అధ్యక్షులు ఎంపికలలో రాహుల్ సరికొత్త విధానాన్ని పాటించారు.పార్టీని భవిష్యత్తులో అధికారంలోకి తీసుకురాగలరు అనుకున్న వారికి పార్టీ పగ్గాలు అప్పగించారు.

అయితే కాంగ్రెస్ లో ఒక్కసారిగా ఇంత ఊపు రావడానికి కారణం ఎవరు అనే ఈ విషయం పైన చర్చ జరుగుతోంది అయితే రాహుల్ నిర్ణయాల వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉన్నట్లుగా ఇప్పుడిప్పుడే కొత్త సంగతులు బయటకు వస్తున్నాయి.రాహుల్ ప్రియాంక గాంధీ లకు ప్రశాంత్ కిషోర్ కొన్ని కీలకమైన సూచనలు చేయడంతోనే,  వారు ధైర్యంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారని, సీనియర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయినా పట్టించుకోకపోవడానికి కారణం ప్రశాంత్ కిషోర్ సలహా లేనని తెలుస్తోంది.

 Rahul Gandhi Believes That Congress Will Come To Power With Prashant Kishores Political Tactics-ఆయనపైనే రాహుల్ ఆశలు కాంగ్రెస్ దశ దిశా మార్చుతారా  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే కేంద్ర అధికార పార్టీ బిజెపి పైన రాజకీయ విమర్శలు చేసే విషయంలో ఎప్పటికప్పుడు ప్రశాంత్ కిషోర్ రాహుల్ కు సలహాలు ఇస్తున్నారని, ఆయన నిర్ణయాల మేరకే రాహుల్ దూకుడుగా ముందుకు వెళుతున్నారని ప్రచారం జరుగుతోంది. 

Telugu Aicc, Bjp Government, Central Government, Congress, Prashant Kishor, Punjab, Rahul Gandhi, Revanth Reddy, Siddu, Telangana Congress-Telugu Political News

 దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు వ్యూహాత్మకంగా ప్రశాంత్ కిషోర్ ముందుకు వెళ్తున్న తీరుతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.రాహుల్ సైతం ప్రశాంత్ కిషోర్ అండదండలు లభించడంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఏర్పడింది.ఇక పూర్తిగా ప్రశాంత్ కిశోర్ డైరెక్షన్ లోనే ముందుకు వెళ్లి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇకపై రాహుల్ కఠిన నిర్ణయాలు తీసుకుంటూ అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను ప్రక్షాళన చేస్తూ ముందుకు వెళ్లేల కనిపిస్తున్నారు.దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చే బాధ్యత తీసుకున్న ప్రశాంత్ కిషోర్ ఈ విషయంలో ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.

#Central #Congress #Prashant Kishor #BJP #Rahul Gandhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు