తమిళనాడు జల్లికట్టు ఉత్సవాలలో రాహుల్ గాంధీ..!!   

మరి కొద్ది రోజులలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు కమలహాసన్ పార్టీ అదేవిధంగా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బరిలోకి దిగుతున్నాయి.

TeluguStop.com - Rahul Gandhi At Tamil Nadu Jallikattu Festival

తమిళ రాజకీయాల్లో ప్రముఖులు అయినా కరుణానిధి, జయలలిత మరణాలతో రాజకీయంగా ఇక్కడ శూన్యత కనిపిస్తున్న నేపథ్యంలో బిజెపి అదేవిధంగా కాంగ్రెస్ ఇదే సరైన సమయం అని రాబోయే ఎన్నికలలో తమిళనాడులో ఎవరికి వారు రాణించడానికి అనేక వ్యూహాలు వేస్తున్నారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ తమిళనాడులో పర్యటిస్తున్నారు.

TeluguStop.com - తమిళనాడు జల్లికట్టు ఉత్సవాలలో రాహుల్ గాంధీ.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కాగా సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే జల్లికట్టు ఉత్సవాలలో మధురైలో వీక్షించారు రాహుల్ గాంధీ.ఈ క్రమంలో తమిళ్ యువకుల పోరాట పటిమను చూసి ఆశ్చర్య పోయినట్లు రాహుల్ స్పష్టం చేశారు.

అంతే కాకుండా తనని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు కూడా తెలిపారు.

Telugu Bjp, Jalli Kattu, Rahul Gandhi, Tamil Nadu-Movie

తమిళనాడు సంస్కృతి, చరిత్ర, భాషపై ప్రశంసల వర్షం కురిపించారు.మరోపక్క ఇదే తరుణంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తమిళనాడులో పర్యటిస్తూ ఉన్నారు.మొత్తంమీద చూసుకుంటే తమిళనాడులో పొంగల్ వేడుకలు చాలావరకు పొలిటికల్ వారోత్సవాలు లాగా మారిపోయాయి.

#Tamil Nadu #Jalli Kattu #Rahul Gandhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు