రూటు మార్చిన రాహుల్ గాంధీ.. ఎన్నికల సమయంలో కొత్త రకంగా ఎన్నికల ప్రచారం..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం ఓటర్లను బాగా ఆకట్టుకుంటున్నారు.ప్రస్తుతం దక్షిణ భారత దేశంలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ తన వినూత్నమైన విన్యాసాలతో ప్రజలను ఆకర్షిస్తున్నారు.

 Congress Leader Rahul Gandhi Campaign In Tiunelvelli, Rahul Gandhi Cooks Biryani-TeluguStop.com

గతంలో లాగా కాకుండా ఇప్పుడు ఓటర్లలో మమేకం అయ్యేందుకు ఆయన పూర్తిస్థాయిలో ముందడుగు వేస్తున్నారు.నిజానికి రాహుల్ గాంధీ చుట్టూ ఎప్పుడూ నేతలు ఉంటారు.

అలాగే ఆయనకు ఎల్లప్పుడూ బిజీ మీటింగ్ లు కూడా ఉంటాయి.ప్రజల్లో తిరిగే సమయం కూడా చాలా తక్కువ.

కానీ దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఎన్నడూ లేని విధంగా ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తన రూటును పూర్తిగా మార్చారు.ఏ ప్రాంతానికి వెళ్లినా ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటూ ప్రజల్లో కలిసిపోతున్నారు.

ఆకర్షణీయమైన రాజకీయ విన్యాసాలు చేస్తూ తన మాటల్లో పదును పెంచుతూ యువ ఓటర్లను బాగా ఆకట్టుకోవడంలో రాహుల్ గాంధీ సక్సెస్ అవుతున్నారు.

Telugu Congressrahul, Rahul Gandhi, Rahulgandhi-Political

రాహుల్ గాంధీలో ఇటువంటి మార్పు రావడం ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతోంది అంటే అతిశయోక్తి కాదు.ప్రత్యర్థి పార్టీని టార్గెట్ చేస్తూనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుందో అనే అంశాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు.కన్యాకుమారిలో రోడ్ షో నిర్వహించిన రాహుల్ గాంధీ.

పళని స్వామి తో పాటు మోడీపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు.వన్ నేషన్ వన్ కల్చర్ అనే మోడీ ఆర్ఎస్ఎస్ వాళ్లు తమిళ సంస్కృతిని అవమానించినప్పుడు ఎందుకు మాట్లాడలేదని సూటిగా ప్రశ్నించారు.

తిరునల్వేళిలో మేదావులతో సమావేశమైన రాహుల్ గాంధీ పార్టీని బలోపేతం చేయడానికి సలహాలను అడిగి తెలుసుకున్నారు.పూర్తిస్థాయిలో రాజకీయ పరిపక్వత చూపిస్తున్న రాహుల్ గాంధీ ఒక వృద్ధాశ్రమం కోసం స్వయంగా బిర్యానీ వండి ఆశ్చర్యపరిచారు.

రైతుల నిరసన కు మద్దతు తెలుపుతూ స్వయంగా ట్రాక్టర్ నడిపిన మోడీకి ప్రత్యామ్నాయంగా కనిపించారు.అందరి కాంగ్రెస్ నేతలకు భిన్నంగా ఉంటూ పాలకుడిగా కాకుండా నాయకుడిగా వ్యవహరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube