ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపై బీసీసీఐకు రాహుల్ ద్రావిడ్ వివరణ..!

ఇటీవలే భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023( ODI World Cup 2023 ) టోర్నీలో భారత జట్టు లీగ్ దశ నుండి సెమీఫైనల్ వరకు ఓటమి అనేదే ఎరుగకుండా ఫైనల్ కు చేరి ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని చవిచూసి టైటిల్ చేజారుకున్న సంగతి తెలిసిందే.

ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమిపై వివరణ ఇవ్వాలని కెప్టెన్ రోహిత్ శర్మ తో పాటు భారత జట్టు హెడ్ కోచ్ ద్రావిడ్ ను బీసీసీఐ కోరింది.

రాహుల్ ద్రావిడ్ బీసీసీఐకు ఇచ్చిన వివరణ ఏంటంటే.ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు ఓటమికి ప్రధాన కారణం పిచ్ టర్న్ అవ్వకపోవడమే.

సెకండ్ ఇన్నింగ్స్ లో పిచ్ అనుకున్నంత టర్న్ అవ్వలేదని ద్రావిడ్ వివరణ ఇచ్చారు.అంతేకాదు భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయడం కూడా ఓటమికి ఒక ప్రధాన కారణమట.

లీగ్ దశలో భారత్, పాకిస్తాన్ ఆడిన మ్యాచ్లో వాడిన పిచ్ నే ఫైనల్ మ్యాచ్లో వాడారు.ఆ పిచ్ పై పాకిస్తాన్( Pakistan ) బ్యాటింగ్ ఎలా సాగిందో.ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు బ్యాటింగ్ కూడా అలాగే సాగిందని రాహుల్ ద్రావిడ్( Rahul Dravid ) బీసీసీఐకు వివరణ ఇవ్వడం జరిగింది.

Advertisement

అయితే మ్యాచ్ అన్నాక గెలుపు ఓటములు సహజమే.లీగ్ దశలో ఒకటి లేదా రెండు మ్యాచ్లలో ఓడి సెమీఫైనల్ చేరితే పర్వాలేదు కానీ లీగ్ దశ నుండి వరుస విజయాలతో ఫైనల్ చేరిన భారత్ ఓడిపోవడంతో భారత జట్టుపై ఎన్నో విమర్శలు వచ్చాయి.భారత జట్టు ఫైనల్ మ్యాచ్లో ఓడిపోవడం ఒక్క భారత్ క్రికెట్ అభిమానులనే కాదు ప్రపంచంలో ఉండే క్రికెట్ ప్రేక్షకులందరికీ ఒక ఊహించని షాక్.

లీగ్ దశలో ఎన్నో ఇబ్బందులు పడ్డ ఆస్ట్రేలియా( Australia ) ఫైనల్ లో మాత్రం ఒత్తిడిని అధిగమించి భారత్ పై చేయి సాధించి టైటిల్ కైవసం చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు