కోహ్లీ సెంచరీ చేయడం ఖాయం అంటూ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

సౌతాఫ్రికాలో సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది.ఈ టెస్ట్ సిరీస్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ ఈరోజు అంటే జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.

 Rahul Dravid Comments On Virta Kohli Virat Kohli, Century, Dravid, Comments,vira-TeluguStop.com

దక్షిణాఫ్రికా సొంతగడ్డపై భారత్ ఇప్పటివరకు టెస్ట్ సిరీస్‌లో గెలిచిన దాఖలాలు లేవు.కానీ ఈసారి భారీ విజయంతో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ సేనకు అనుకూలాంశాలు కనిపిస్తున్నాయి.

ప్రధానంగా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈసారి విధ్వంసకర బ్యాటింగ్‌తో టీమిండియాకు మరపురాని విజయాన్ని సాధించి పెట్టొచ్చని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ అయిన రాహుల్ ద్రవిడ్ కోహ్లీ బ్యాటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈసారి కోహ్లీ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఎక్కువ సమయం పాటు క్రీజులో ఉండగలుగుతాడని ద్రవిడ్ విశ్లేషించారు.విరాట్ బ్యాటింగ్‌లో ఎలాంటి లోపాలు లేవని.కాకపోతే ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లడంలో కాస్త తడబడుతున్నాడని.అంతకు మించి ఇబ్బందులేని పెద్దగా లేవని ద్రవిడ్ వివరించారు.

జట్టులో అందరికంటే కోహ్లీ ఒక్కడే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ చాలా ప్రశాంతంగా ఉన్నాడని ద్రవిడ్ వెల్లడించారు.ఇలాంటి మంచి మెంటల్ స్టేట్ లో ఉన్న విరాట్ ఈ టెస్ట్ సిరీస్‌లో సెంచరీ చేయొచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే కూడా ఈసారి భారీ స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.విరాట్ కోహ్లీ 2019, నవంబర్ లో ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో సెంచరీ చేసిన తర్వాత మళ్లీ ఇంకో సెంచరీ చేయలేదు .

Telugu Century, Dravid, Virat Kohli-Latest News - Telugu

ఫామ్‌లో లేక సతమతమవుతున్న తనని అందరూ విమర్శిస్తున్నందున ప్రెస్ మీటింగ్ కు కోహ్లీ హాజరు కాకుండా తప్పించుకుంటున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఈ రూమర్స్ ని కొట్టిపారేసారు ద్రవిడ్.కోహ్లీ 100వ టెస్టు రోజు విలేకరుల సమావేశంలో పాల్గొంటాడని.అప్పటివరకు ప్రెస్ మీట్ వాయిదా వేస్తానని తనతో చెప్పినట్లు క్లారిటీ ఇచ్చారు.జనవరి 11న కేప్‌టౌన్‌లో జరిగే మూడో టెస్టుతో కోహ్లి వందో టెస్టు ఆడినట్లు అవుతుంది.ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube