ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళల 33 శాతం రిజర్వేషన్! రాహుల్ ప్రకటన!  

ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకి 33 శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించిన రాహుల్ గాంధీ. .

  • దేశంలో మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్రధాని కావాలని లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన ప్రసంగాలతో ప్రజలని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. తనపై ఉన్న ముద్రని చెరిపేసుకొని, నిర్దేశించుకున్న లక్ష్యాలని పూర్తి చేసి, అలాగే బలమైన నాయకుడుగా ప్రజలతో ఆమోదం పొందాలనే ప్రయత్నం రాహుల్ లో బలంగా కనిపిస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించే లక్షణాలు తనకి ఉన్నాయని పదే పదే నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

  • Rahul Announce 33 Percent Women Reservation In Government Jobs-33 Jobs Bjp Congress Modi Rahul Sonia Gandhi Tdp

    Rahul Announce 33 Percent Women Reservation In Government Jobs

  • ఇదిలా ఉంటే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల మేనిఫెస్టో లో కీలక అంశాలని ప్రజలకి తెలియజేసే ప్రయత్నం రాహుల్ చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా అతనో కీలక అంశం ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకి 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే జీఎస్టీలో కూడా సమూల మార్పులు చేస్తామని తెలియజేసారు. మరి మహిళల ఓటు బ్యాంకు కోసం రాహుల్ వేసిన ఈ ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.