రికార్డులు సృష్టించిన రాహుల్, డికాక్ జోడీ

ఐపీఎల్‌ 2022 సీజన్‌ చివరి దశలో క్రికెట్‌ ప్రేమికులకు కావాల్సిన అసలుసిసలైన మజా లభించింది.ఐపీఎల్-15లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు క్వింటన్ డికాక్, కెఎల్ రాహుల్ లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.ఈ ఇద్దరూ కలసి కేకేఆర్ తో ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో రెచ్చిపోయి ఆడి కోల్కతా బౌలర్లకు పీడకలలు మిగిల్చారు.ఈ సందర్బంగా ఈ ఇద్దరు పలు వ్యక్తిగతంగానే గాక జట్టుగా కూడా కొత్త రికార్డులు నమోదు చేశారు.

 Rahul And Decock Pair Up To Create Records New Record, Rahul, Dikak, Sports Upda-TeluguStop.com

అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం.ముఖ్యంగా లక్నో ఓపెనర్లు డికాక్‌ (70 బంతుల్లో 140 నాటౌట్‌; 10 ఫోర్లు, 10 సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌ (51 బంతుల్లో 68 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు)లు ఆకాశమే హద్దుగా చెలరేగి చాలాకాలం తర్వాత అసలైన ఐపీఎల్‌ మజాను ప్రేక్షకులకు అందించారు.

ఐపీఎల్ చరిత్రలో డికాక్-రాహుల్ లు నెలకొల్పిన ఓపెనింగ్ భాగస్వామ్యం 210 పరుగులు.అది కూడా అజేయంగా.ఈ జాబితాలో ఇంతకుముందు సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు జానీ బెయిర్ స్టో-డేవిడ్ వార్నర్ లు అగ్రస్థానంలో ఉన్నారు.2019లో ఈ జంట 185 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.అంతకుముందు గౌతం గంభీర్-క్రిస్ లిస్ లు 2017 లో.184 పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేశారు.ఐపీఎల్‌ చరిత్రలో తొలి జోడీగా.ఐపీఎల్‌ చరిత్రలోనే 20 ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉన్న ఏకైక జోడీగా డికాక్‌-రాహుల్‌ జోడీ రికార్డుల్లోకెక్కింది.లీగ్‌ చరిత్రలో ఏ జోడీ కూడా మొత్తం 20 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేయలేదు

Telugu Dikak, Latest, Rahul-Latest News - Telugu

కేకేఆర్ పై అత్యధిక ఓపెనింగ్ పార్ట్నర్షిప్. కేకేఆర్ పై రాహుల్-డికాక్ లు 210 పరుగులు జోడించారు.అంతకుముందు 2012 లో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ-హెర్షలీ గిబ్స్ లు 167 పరుగుల (రెండో వికెట్ కు ) భాగస్వామ్యాన్ని జోడించారు.2017 లో డేవిడ్ వార్నర్- శిఖర్ ధావన్ లు తొలి వికెట్ కు 139 పరుగులు జతచేశారు.అనంతరం కేకేఆర్‌ బ్యాటర్లు సైతం అద్భుతమైన పోరాట పటిమ కనబర్చడంతో మ్యాచ్‌ చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగింది.అయితే కేకేఆర్‌ ఆఖరి రెండు బంతులకు రెండు వికెట్లు కోల్పోవడంతో 2 పరుగుల స్వల్ప తేడాతో మ్యాచ్‌ను చేజార్చుకుంది.

ఫలితంగా ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో కోల్‌కథ ముగిసినట్లైంది.లక్నో దర్జాగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube