తెలంగాణ గ‌డ్డ‌పై ఒకేరోజు రాహుల్‌, అమిత్‌షా ప‌ర్య‌ట‌న‌లు.. టీఆర్ఎస్‌లో టెన్ష‌న్‌

తెలంగాణ రాజ‌కీయాలు ఇప్పుడు మంచి హీటు మీదున్నాయి.అన్ని పార్టీలు ఫుల్ జోష్ మీద రాజ‌కీయాలు చేస్తున్నాయి.

 Rahul And Amit Shah's One-day Tour Of Telangana Gadda Tension In Trs, Rahul, Ami-TeluguStop.com

ఇక టీఆర్ఎస్ ను మించి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దూకుడు మీదున్నాయి.వ‌రుస స‌భ‌లు, మీటింగులు, పాద‌యాత్ర‌ల‌తో హోరెత్తిస్తున్నాయి.

ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ ద‌ళిత‌, గిరిజ‌న దండోరా లాంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుండ‌టంతో ఆ పార్టీలో మంచి జోరు క‌నిపిస్తోంది.ఇంకోవైపు బీజేపీ త‌ర‌ఫున బండి సంజ‌య్ కూడా పాద‌యాత్ర‌ల పేరుతో హోరెత్తిస్తున్నారు.

ఇక ఈ దూకుడును మ‌రింత పెంచేందుకు కేంద్ర పెద్ద‌లు ఎంట‌ర్ అవుతున్నారు.

ఈ త‌రుణంలోనే తెలంగాణపై బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీ పెద్ద‌లు ఫోకస్ పెట్టి త‌మ పార్టీల‌ను మ‌రింత బ‌ల‌ప‌రిచేందుకు వ‌స్తున్నారు.

కాగా బీజేపీ నుంచి అమిత్ షా, కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ తెలంగాణ గ‌డ్డ‌పై ఈ నెల 17న తెలంగాణ విమోచన దినం సందర్భంగా ఒకేరోజు ఇద్ద‌రూ పర్యటించనున్నారు.ఇందుకోసం ఇరు పార్టీలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఇక నిర్మల్ లో వెయ్యి ఊడల మర్రి ద‌గ్గ‌ర బీజేపీ అమిత్ సా కోసం భారీ సభ ఏర్పాటు చేస్తోంది.ఇక ఈ స‌భ‌కు కోసం బండి సంజయ్ ప్ర‌స్తుతం తాను చేస్తున్న పాదయాత్రను ఆపేసి మ‌రీ అందులో పాల్గొంటున్నారు.

Telugu Amit Shah, Bandi Sanjay, Cm Kcr, Congress, Rahul, Revanth Reddy, Tg-Telug

ఇంకోవైపు కాంగ్రెస్ కూడా వరంగల్ లో దళిత, గిరిజన దండోరా సభల్లో భాగంగా ఇక్క‌డ కూడా ఒక స‌భ ఏర్పాటు చేసి ఈ జిల్లాలో ప‌ట్టు పెంచుకునేందుకు రాహుల్ గాంధీని ర‌ప్పిస్తున్నారు.ఇక ఇందులో ఆయ‌న పాల్గొంటారని మాణిక్కం ఠాకూర్ తెలిపారు.ఇక కాంగ్రెస్ ప‌గ్గాలు రేవంత్ రెడ్డి తీసుకున్న త‌ర్వాత మొద‌టిసారి రాహుల్ తెలంగాణలో అడుగు పెడుతుండ‌టంతో భారీగా జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు రేవంత్‌.

ఇక ఈ స‌భ‌ల‌తో బీజేపీ, కాంగ్రెస్‌లో పునరుత్తేజం తీసుకురావాల‌ని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు.ఇక రెండు పార్టీల అగ్ర నేత‌లు వ‌స్తుండ‌టంతో టీఆర్ ఎస్‌లో కొంత టెన్ష‌న్ మొద‌లైంది ఈ స‌భ‌కు స‌క్సెస్ అయితే గ‌న‌క రానున్న రోజుల్లో వీటి బ‌లం మ‌రింత పెరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube